‘వండర్ వుమన్’ గాల్ గాడోట్ మూడవసారి తల్లి అయ్యింది. గతేడాది మార్చిలో గర్భం దాల్చిన గాడోట్ ఈ సంతోషకమైన వార్తను ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 36 ఏళ్ళ ఈ బ్యూటీ తన మూడవ బిడ్డకు స్వాగతం పలికారు. మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫ్యామిలీ పిక్ ను పోస్ట్ చేస్తూ పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చిన విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఆ పసిబిడ్డ పేరు డానియెల్లా అని ప్రకటించారు. ఈ పిక్ లో గాల్ గాడోట్ తన భర్త యారోన్ వర్సానో, వారి కుమార్తెలు మాయ, అల్మా, న్యూ బార్న్ బేబీతో కలిసి సంతోషంగా కన్పిస్తున్నారు.
A post shared by Gal Gadot (@gal_gadot)
గాడోట్, యారోన్ ను 2008లో వివాహం చేసుకున్నారు. ఇక ఈ సందర్భంగా గాడోట్ జంటకు గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనస్ శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఇప్పుడు పలువురు సెలెబ్రిటీలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ ‘వండర్ వుమన్’ అభిమానులు ఆమె కుటుంబంలోకి కొత్తగా మరో బేబీ చేరిన కారణంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Read Also : అజిత్ అభిమానులా మజాకా… ట్రెండ్ సెట్ చేసేస్తున్నారుగా…!