Site icon NTV Telugu

Tollywood: దేవుళ్లుగా కనిపించడానికి స్టార్స్‌ పనికి రారా?

Tollywood Gods

Tollywood Gods

కల్కిలో ప్రభాస్‌, కమల్‌హాసన్‌ వంటి స్టార్‌ హీరోలు.. దీపిక పదుకునే వంటి క్రేజీ హీరోయిన్‌ వున్నా.. రిలీజ్‌ తర్వాత వీళ్లందరికంటే సినిమాలో ఒక యాక్టర్‌ గురించే ఎక్కువగా మాట్లాడుకున్నారు. లేటెస్ట్‌గా వచ్చిన మిరాయ్‌లో హీరో తేజ సజ్జా, విలన్‌ మనోజ్‌ కంటే మరో యాక్టర్‌ ఫేమస్‌ అయ్యాడు. క్రేజీ హీరోల కంటే రెండు, మూడు నిమిషాలు కనిపించే వాళ్ల గురించే ఎందుకు మాట్లాడుకుంటున్నారు?
హైలైట్‌గా నిలిచే సీన్స్‌.. రోల్స్‌కు పెద్ద హీరోలు.. క్రేజ్‌ వున్న హీరోలను తీసుకోవడానికి దర్శకుడు వెనుకడుగు వేస్తున్నారు. నోటెడ్‌ కాని ఫేసులతో బరువైన పాత్రలు వేయిస్తున్నారు. ఒకవేళ అదీ కుదరపోతే విఎఫ్‌ఎక్స్‌ను నమ్ముకుంటున్నారు.

Also Read :Mirai – Little Hearts : లిటిల్ హార్ట్స్ ను బతికించిన మిరాయ్ నిర్ణయం..

సినిమాల్లో స్టార్ల కంటే చిన్న పాత్రలకే ఎక్కువ క్రేజ్ వస్తోంది. కొన్నిసార్లు ప్రేక్షకులకు ఆ పాత్రలో నటించింది ఎవరో తెలుసుకోవాలనిపించి గూగుల్‌లో కూడా వెతుకుతున్నారు. ముఖ్యమైన పాత్రలే అయినా, దర్శకులు క్రేజీ యాక్టర్స్‌ను పెట్టకుండా కొత్తవాళ్లకు అవకాశం ఇస్తున్నారు. క్రేజీ హీరోలను తీసుకుంటే, చిన్న పాత్రల్లో సరిగా నటించలేరంటూ విమర్శలు వస్తున్నాయి. అందుకే దర్శకులు రిస్క్ లేకుండా, క్రేజ్ లేని నటులనే తీసుకుంటున్నారు. వారికి ఇది ఒక మంచి అవకాశంగా కూడా మారుతుంది.

Also Read :సోషల్ మీడియాపై అందాల భామల అలక పాన్పు

లేటెస్ట్‌గా వచ్చిన మిరాయ్ సినిమాలో హీరో తేజ సజ్జా, విలన్ మనోజ్ కంటే ఒక థియేటర్ ఆర్టిస్ట్ గౌరవ్ బోరా ఎక్కువ ఫేమస్ అయ్యాడు. ఈ సినిమాలో శ్రీరాముడి పాత్రలో నటించింది గౌరవ్ బోరానే. ఆయన ఇంతకు ముందు షార్ట్ ఫిలింస్, వెబ్ సిరీస్‌లు, యాడ్స్‌లో నటించారు. ఈ ఒక్క సినిమాతో గౌరవ్ బోరాకు మంచి పేరు వచ్చింది. హైలైట్ అయ్యే సీన్స్, పాత్రలకు పెద్ద హీరోలు, క్రేజ్ ఉన్న హీరోలను తీసుకోవడానికి దర్శకుడు వెనుకడుగు వేస్తున్నాడు. వారికి నోటెడ్ కానీ ఫేసులతో బరువైన పాత్రలు వేయిస్తున్నారు. ఒకవేళ అది కూడా కుదరకపోతే, వీఎఫ్ఎక్స్ ను నమ్ముకుంటున్నారు. ఈ కొత్త పద్ధతి వల్ల కొత్త నటులకు అవకాశాలు వస్తున్నాయి, సినిమా కథకు కూడా ప్రాధాన్యత పెరుగుతోంది.

Exit mobile version