కూలీతో వెయ్యి కోట్ల గ్యారెంటీ ఫిల్మ్ అనేలా అంచనాలు పెంచి తుస్సుమనిపించాడు లోకేశ్ కనగరాజ్. భారీ మల్టీస్టారర్స్‌తో ప్రయోగం చేస్తే సరిపోదు.. కథ క్వాలిటీ ముఖ్యమని క్లియర్ రిజల్ట్ ఇచ్చారు ఆడియన్స్. ధౌజండ్ క్రోర్ మాటేరుగు.. 500 కోట్లు దాటడానికి నానా అవస్థలు పడింది ఫిల్మ్. ఈ దెబ్బకు లోకీపై ప్రేక్షకుల్లోనే కాదు.. స్టార్ హీరోల్లో కూడా ఈక్వేషన్స్ మారిపోయాయి. అమీర్‌తో నెక్ట్స్ ఇయర్ ప్రాజెక్ట్ ఉండబోతుందని లోకీ ఎనౌన్స్ చేయగా.. క్రియేటివ్ డిఫరెన్స్ బాలీవుడ్ హీరో క్విట్ అయ్యాడని టాక్. ఇప్పుడు మల్టీస్టారర్ చిత్రం కూడా చేజారినట్లు తలైవా మాటల్లో తేటతెల్లమైంది.
Also Read :Ranbir Kapoor: రణ్ బీర్ కపూర్ పై కేసు.. NHRC ఆదేశాలు
46 సంవత్సరాల తర్వాత కోలీవుడ్‌లో అరుదైన కలయిక జరగబోతుందని.. రజనీ, కమల్ హాసన్ కలిసి నటిస్తున్నారని.. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించబోతున్నాడన్న టాక్ గట్టిగానే నడిచింది. కమల్ కూడా మల్టీస్టారర్ ఉండబోతుందని ఓ ఈవెంట్లో ఎనౌన్స్ చేశారు. కానీ రీసెంట్లీ రజనీకాంత్‌ను ఈ ప్రశ్నే సంధిస్తే.. కథ, రోల్ డైరెక్టర్ సెట్టయితే నటిస్తానంటూ క్లారిటీ ఇచ్చేశారు. నెక్ట్స్ రాజ్ కమల్ ఫిల్మ్స్, రెడ్ జెయింట్ నిర్మాణంలో సినిమా చేస్తున్నట్లు చెప్పారు తలైవా. ఈ లెక్కన లోకీతో మూవీ లేనట్లేనని తేలిపోయింది. దీంతో లోకీని బిలీవ్ చేసే పరిస్థితుల్లో స్టార్ హీరోలు లేరన్నది కోలీవుడ్ ఇన్నర్ టాక్
Also Read :Rashmika Mandanna: ప్లాప్ వచ్చినా రష్మికను నార్త్ బెల్ట్ వదులుకోలేకపోతుందా..?
తలైవా రజనీ, ఉళగనాయగన్ కమల్ హాసన్‌ను హ్యాండిల్ చేయగల దర్శకుడు ఎవరన్నదీ ప్రశ్న తలెత్తులోంది. ఫామ్ కోల్పోయిన మణిరత్నం, శంకర్లను నమ్మలేని పరిస్థితి. న్యూ స్టోరీలతో హిట్స్ అందుకుంటోన్న యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్లను న్యాయం చేయగలరన్నది కొందరి వాదన. ప్రజెంట్ మంచి ఫామ్‌లో ఉన్న నెల్సన్, అధిక్ రవిచంద్రన్ పేర్లు వినిపిస్తున్నాయి. కానీ వీరితో పోలిస్తే బ్యాక్ టు బ్యాక్ హిట్లతో ఊపుమీదున్న ప్రదీప్ రంగనాథ్ కరెక్ట్ ఛాయిస్ అన్నది క్రిటిక్స్ ఫీలింగ్. మరీ మల్టీస్టారర్లను డీల్ చేసే భాగ్యం ఎవరికీ దక్కుతుందో లెట్స్ వెయిట్. ఇక లోకీ.. ప్రస్తుతం హీరోగా ఓ ఫిల్మ్ చేశాక.. ఖైదీ2ని పట్టాలెక్కించనున్నాడన్నది లేటెస్ట్ బజ్.