బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే స్థాయిలో ఉంటుంది. అతను ప్రపంచంలో ఎక్కడ ప్రదర్శన ఇచ్చినా.. అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. తాజాగా అర్జిత్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ గా మారింది. అర్జిత్ ఆరోగ్యంపై ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అసలు విషయం ఏంటంటే..
READ MORE: Business Idea : బొప్పాయి సాగు చేయండి.. రూ.15లక్షలు సంపాదించండి
యూకేలో బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్ పర్యటించనున్నారు. ఆగస్ట్ 11న ప్రారంభం కానున్న తన షోలను అరిజిత్ సింగ్ వాయిదా వేశాడు. ఈ నిర్ణయానికి ఆరోగ్య సమస్యలు కారణమని అర్జిత్ సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. దీనికి తోడు అభిమానులకు క్షమాపణలు కూడా చెప్పాడు.
READ MORE:CM Revanth Reddy: ఎల్బీ స్టేడియంలో స్పోర్ట్స్ తగ్గాయి.. రాజకీయ సభలు ఎక్కువయ్యాయి..
అరిజిత్ సింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ను పంచుకున్నాడు.. అందులో అతను తన షోలు వాయిదా గురించి తెలియజేశాడు. “ప్రియమైన అభిమానులారా, అనుకోని వైద్య పరిస్థితుల వల్ల ఆగస్టులో యూకే షో వాయిదా వేయవలసి వచ్చింది. పంచుకోవడానికి చాలా బాధగా ఉంది. ఈ షోల కోసం మీరు ఎంత ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారో నాకు తెలుసు. మిమ్మల్ని నిరాశపరిచినందుకు క్షమాపణలు కోరుతున్నాను.” అని పోస్ట్ లో అర్జిత్ పేర్కొన్నాడు. అర్జిత్ తన ‘వైద్య పరిస్థితి’ ఏమిటో తన పోస్ట్ లో చెప్పలేదు.
READ MORE: D. Sridhar Babu: కేటీఆర్ చెప్పినట్లు గానే తప్పుడు ప్రచారాలపై విచారణ చేస్తాం..
అర్జిత్ పోస్ట్ చూసిన అభిమానులు ప్రార్థనలు చేయడం ప్రారంభించారు. చాలా మంది అభిమానులు ‘త్వరగా కోలుకోవాలని’ పోస్టులు చేస్తున్నారు. ఒక వినియోగదారు కామెంట్ లో.. “మీరు త్వరగా కోలుకుంటారు. మేము ఆగస్టు 11 నుంచి మొదలయ్యే షో కోసం చాలా ఉత్సాహంగా ఎదురుచూశాం. కానీ ఇప్పడుటికీ మీ ఆరోగ్యం మాకు చాలా ముఖ్యం. మేము ప్రతి క్షణం, ప్రతి పరిస్థితిలో మీతో ఉంటాం.” అని రాశాడు.
READ MORE:Supreme Court: వ్యవస్థీకృత వైఫల్యం కాదు.. నీట్ పేపర్ లీక్ పై సుప్రీంకోర్టు తుది తీర్పు
అరిజిత్ షో కొత్త తేదీలు: 15 సెప్టెంబర్ (లండన్), 16 సెప్టెంబర్ (బర్మింగ్‌హామ్), 19 సెప్టెంబర్ (రోటర్‌డామ్), 22 సెప్టెంబర్ (మాంచెస్టర్). మునుపటి షెడ్యూల్ ప్రకారం కొనుగోలు చేసిన టిక్కెట్లు మాత్రమే ఇప్పటికీ చెల్లుబాటులో ఉంటాయి.