దర్శకుడు వశిష్ట రూపొందించిన సోషియో ఫాంటసీ విశ్వంభర సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్‌ల సమర్పణలో భారీ స్థాయిలో నిర్మించారు. మెగాస్టార్ చిరంజీవి రేపు తన జన్మదిన వేడుకలను జరుపుకుంటున్న సందర్భంగా, ఆయన అభిమానులకు ‘విశ్వంభర’ టీం మంచి సర్ప్రైజ్ ఇచ్చింది. గ్లింప్స్, సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతూ, ఒక గొప్ప సినిమాటిక్ అనుభవాన్ని అందిస్తున్నామని చెప్పేసింది.
Also Read:Andhra King Taluka : ఆంధ్రా కింగ్ తాలూకా రిలీజ్ అప్పుడే
ఈ గ్లింప్స్ ఒక బాలుడు, వృద్ధుడి మధ్య జరిగే ఆకర్షణీయ సంభాషణతో ప్రారంభమవుతుంది. విశ్వంభర ప్రపంచంలో సంభవించిన భయానక సంఘటనల గురించి వారు చర్చిస్తూ కనిపిస్తారు. ఒక వ్యక్తి స్వార్థం వల్ల జరిగిన మహా వినాశనాన్ని వృద్ధుడు వివరిస్తాడు. అయితే, ఆ క్లిష్ట సమయంలో రక్షకుడు ఎట్టకేలకు ఆవిర్భవిస్తాడు. ఆ రక్షకుడిగా చిరంజీవి ఎంట్రీ అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. ఈ గ్లింప్స్, చిరంజీవిని ఒక అసాధారణ పాత్రలో చూడాలనే సినీ ప్రియుల ఆసక్తిని రెట్టింపు చేస్తుంది. దర్శకుడు వశిష్ట, విశ్వంభర ప్రపంచాన్ని ఆకర్షణీయ రీతిలో రూపొందించినట్లు కనిపిస్తోంది. చిరంజీవి తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ప్రతి ఫ్రేమ్‌ను ఆకర్షిస్తూ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నారు.
Also Read:Andhra King Taluka : ఆంధ్రా కింగ్ తాలూకా రిలీజ్ అప్పుడే
ఇక ప్రొడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాష్, విశ్వంభర ప్రపంచాన్ని కలల సౌరభంతో తీర్చిదిద్దారు. సినిమాటోగ్రాఫర్ చోటా కె. నాయుడు, ఈ ఫాంటసీ జగత్తును అద్భుతమైన విజువల్స్‌తో జీవం పోశారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి స్వరపరిచిన నేపథ్య సంగీతం, గ్లింప్స్‌కు మరింత ఎమోషనల్ టచ్ ఇచ్చింది . వీఎఫ్‌ఎక్స్ పనితనం హాలీవుడ్ స్థాయిలో ఉండి, యూవీ క్రియేషన్స్ భారీ నిర్మాణ విలువలను స్పష్టంగా ప్రతిబింబిస్తోంది.
‘విశ్వంభర’ చిరంజీవి కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలవనుందని ఈ గ్లింప్స్ సూచిస్తోంది. అభిమానులకు ఈ గ్లింప్స్ నిజంగా చిరంజీవి జన్మదినానికి అద్భుతమైన బహుమతిగా నిలిచింది. ఈ చిత్రంలో త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తుండగా, అశిక రంగనాథ్, కునాల్ కపూర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఇప్పటికే ప్రకటించినట్లుగా, ‘విశ్వంభర’ 2026 వేసవిలో తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.