ఈ ఏడాది ఆరంభంలో గామి, ఇటీవల గ్యాంగ్స్ అఫ్ గోదావరి సినిమాలు రిలీజ్ చేసాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. ప్రస్తుతం రామ్ నారాయణ్ అనే నూతన డైరెక్టర్ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానేర్ లో “లైలా” అనే సినిమాను ఇటీవల ప్రారంభించాడు విశ్వక్ సేన్. కాగా లైలా చిత్రంలో తొలిసారి అమ్మాయి పాత్రలో కనిపించనున్నాడు విశ్వక్. అందుకోసం తగిన మెళుకువలు కూడా నేర్చుకొంటున్నాడు. ఈ చిత్రం విశ్వక్ కేరీర్ లో నిలిచిపోయే సినిమా అవనుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. విశ్వక్ ఈ చిత్రంలో నటిస్తూనే పలు కథలు వినే పనిలో ఉన్నాడు. తాజగా ఓ సినిమా ఎక్కడెక్కడో తిరిగి చివరికి విశ్వక్ కాంపౌండ్ లో వాలినట్టు సమాచారం.
పీపుల్స్ మీడియా నిర్మాతలు దర్శకుడు కృష్ణ చైతన్య చెప్పిన ఓ కథను లాక్ చేసి ఉంచారు. ఆ కథను నితిన్ కు వినిపించి గ్రీన్ సిగ్నల్ కూడా తెచ్చుకొన్నారు. అదే సమయంలో దర్శకుడు కృష్ణ చైతన్య గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (GOG) చేస్తుండడంతో అది పూర్తి అయ్యాక నితిన్ ప్రాజెక్ట్ చేసేలా ప్లాన్ చేశారు. కానీ GOG బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అవడంతో కృష్ణ చైతన్య సినిమాను పక్కన పెట్టాడు నితిన్. దీంతో నిర్మాతలు అదే కథను కొన్ని మార్పులు చేసి విశ్వక్ కు వినిపించడం, గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అన్ని చక చక జారిపోయాయి. తనకు GOG రూపంలో ప్లాప్ ఇచ్చినా కూడా కృష్ణ చైతన్యకు మరో అవకాశం ఇచ్చాడు విశ్వక్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించే ఈ చిత్రానికి “పవర్ పేట” అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసారు నిర్మాతలు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది విశ్వక్ సేన్ పవర్ పేట.
Also Read: RajtarunLavanya : నార్సింగిలో రాజ్ తరుణ్ లవర్ లావణ్య హై డ్రామా.