టాలీవుడ్లోకి మరో కొత్త ప్రొడక్షన్ హౌస్ ఎంట్రీ ఇచ్చింది. విక్రాంత్ ఫిల్మ్ క్రియేషన్స్ (VFC) ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ పార్రంభ పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. VFC ప్రొడక్షన్ హౌస్ ద్వారా శివకృష్ణ మందలపు నిర్మాతగా తెలుగు పరిశ్రమలోకి అడుగు పెట్టడానికి సిద్ధమవుతున్నారు. పార్రంభ పూజా కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత సాహు గారపాటి, అడ్డా సినిమా దర్శకుడు కార్తీక్ రెడ్డి, నిర్మాత రాందాస్ ముత్యాల, వ్యాపార వేత్త నర్సింహ రెడ్డి, మందలపు ప్రవళిక, స్వప్న చౌదరి అమ్మినేని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శివకృష్ణ మందలపు గారు మాట్లాడుతూ, “మా విక్రాంత్ ఫిల్మ్ క్రియేషన్స్ బ్యానర్ పై త్వరలో ఒక పెద్ద సినిమా మొదలవుతుంది, భవిష్యత్తులో ఎన్నో మంచి సినిమాలు నిర్మించాలన్నదే మా లక్ష్యం అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో సినిమా టీం సహా ఇతర సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఇక వేద పండితుల సమక్షంలో పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. VFC నుండి త్వరలోనే మేజర్ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ వెలువడనున్నట్టు తెలుస్తోంది.