విభిన్నమైన కథలతో, తన నటనతో సినిమాలు చేస్తూ ఉన్నారు విక్రమ్. హిట్లు ఫ్లాప్ లను పట్టించుకోకుండా సినిమాలు చేస్తున్నాడు చియాన్. వాస్తవానికి శంకర్ దర్శకత్వంలో వచ్చిన అపరిచితుడు విక్రమ్ కెరీర్ లో వచ్చిన లాస్ట్ బిగ్గెస్ట్ హిట్. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించినా కూడా అవేవి ఆ స్థాయి హిట్ ఇవ్వలేదు. అయినా సరే విక్రమ్ కు ఆఫర్లు ఎక్కడా తగ్గలేదు. విక్రమ్ తాజా చిత్రం ‘తంగలాన్’. పాన్ ఇండియా లెవెల్ లో రానున్న ఈ చిత్రాన్ని పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించాడు దర్శకుడు పా.రంజిత్. ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.
తాజాగా తంగలాన్ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు సభ్యులు ‘తంగలాన్’ కు చిన్న చిన్న కట్స్ మరియు అక్కడక్కడా మ్యూట్ తో యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసి చిత్ర యూనిట్ ను సెన్సార్ సభ్యులు అభినందించారు. కాగా తంగలాన్ చిత్రం 2 గంటల 36 నిమిషాల 59 సెకండ్ల రన్‌టైమ్ తో విడుదల కానుంది. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం అన్ని అవాంతారాలు దాటి ఇండిపెండెన్స్ డే కానుకగా రిలీజ్ కానుంది.
కోలార్ బంగారు గనుల నేపథ్యంలో ఈ కథ బ్రిటీష్ కాలంనాటి కథాశంతో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది. ఈ చిత్రంలో పార్వతి, మాళవిక మోహనన్ కథానాయికలుగా నటించారు. యధార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్ లో కే.ఈ జ్ఞానవేల్ రాజా దాదాపు రూ. 100 కోట్లతో నిర్మించారు. తమిళ్ తో పాటు తెలుగులో రిలీజ్ అవనున్న ఈ చిత్రాన్ని తెలుగులో మైత్రీ మూవీస్ విడుదల చేస్తోంది.
Also Read: Rajni: ఈ వయసులో కూడా రచ్చ లేపుతున్న సూపర్ స్టార్ రజనీకాంత్..ఎన్ని సినిమాలు చేస్తున్నాడో తెలుసా..?