రోల్స్ రాయిస్ కేసులో విజయ్ కు ఊరట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తలపతి విజయ్ లగ్జరీ కారు కాంట్రవర్సీ మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా ఈ కేసులో మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పు విజయ్ కు ఊరటనిచ్చింది. 2011-12 సంవత్సరంలో విజయ్ ఇంగ్లాండ్ నుంచి ఖరీదైన రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారును దిగుమతి చేసుకున్నారు. అప్పటికే ఆ కారు గురించి కస్టమ్స్ అధికారులకు పన్ను చెల్లించారు. అయితే అదే సమయంలో ఎంట్రీ ట్యాక్స్ కట్టే విషయంలో మినహాయింపు కావాలని కోరుతూ చెన్నై అసిస్టెంట్ కమిషనర్ కు లేఖ రాశారు. కానీ వారు దానికి అంగీకరించలేదు. దీంతో తాను దిగుమతి చేసుకున్న రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారు కోసం ఎంట్రీ టాక్స్ వసూలు చేయకుండా ఉండాలని టిఎన్ ప్రభుత్వం, సంబంధిత ప్రభుత్వ విభాగాలను ఆదేశించాలని కోర్టు తీర్పుని కోరుతూ నటుడు రిట్ ఆఫ్ మాండమస్ ను దాఖలు చేశారు. జస్టిస్ సుబ్రమణ్యం కొట్టివేసిన రిట్ పిటిషన్ తొమ్మిదేళ్లుగా పెండింగ్‌లో ఉంది. పన్ను చెల్లించకుండా ఉండటానికి పిటిషన్ దాఖలు చేసినందుకు న్యాయమూర్తి విజయ్ ని విమర్శించారు. పన్ను చెల్లించడం కర్తవ్యం అని, వారి ఇష్టానుసారం ఇవ్వడానికి అదేమీ విరాళం కాదని, పన్నులు చెల్లించే విషయంలో సెలెబ్రిటీలు రూల్స్ పాటించాలి అంటూ మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు జస్టిస్ సుబ్రమణ్యం బెంచ్ విజయ్ కు లక్ష రూపాయల జరిమానా విధించింది.
Read Also : ‘కె.జి.ఎఫ్. -2’ ఆలస్యానికి అదే కారణమా!?
Also Read
దీంతో సింగిల్ బెంచ్ జస్టిస్ సుబ్రమణ్యం ఇచ్చిన తీర్పును విజయ్ సవాల్ చేయడంతో మరో బెంచ్ కు మార్చారు. తాజాగా ఈ కేసు విషయంలో హైకోర్టు సానుకూలంగా స్పందించింది. మునుపటి ఉత్తర్వు కాపీ లేనప్పటికీ, రిజిస్ట్రార్ కేసును షెడ్యూల్ చేయవచ్చని తెలుపుతూ విజయ్ పై విమర్శనాత్మక వ్యాఖ్యలతో కోర్టు గతంలో జారీ చేసిన ఉత్తర్వులకు స్టే ఇచ్చింది. అయితే టాక్స్ చలాన్ జారీ చేసిన వారంలోపు విజయ్ 80% పన్ను మొత్తాన్ని చెల్లించాలని హైకోర్టు న్యాయమూర్తులు ఆదేశించారు.
తాజావార్తలు
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!