అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌లో వైజయంతి పాత్రలో నటించిన సీనియర్ నటి విజయశాంతి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆమె మాట్లాడుతుండగానే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరూ స్టేజ్ మీదకు వెళ్లారు. విజయశాంతి మాట్లాడుతూ, “జూనియర్ ఎన్టీఆర్ గారికి ఈ ఈవెంట్‌కు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సినిమా గురించి చెప్పాలంటే, కళ్యాణ్ రామ్ గారు, నేను ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ సినిమా చేశాము,” అని అన్నారు. అప్పుడే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌తో కలిసి స్టేజ్ మీదకు వెళ్లే ప్రయత్నం చేశారు. విజయశాంతి మాట్లాడుతూ, “ఇది అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మూవీ. ఒక తల్లి పడే ఆరాటం, కొడుకు చేసే పోరాటం, ఈ సినిమాలో మా ఇద్దరి మధ్య జరిగే యుద్ధం రేపు సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది,” అని అన్నారు. ఈలోపు “ఎన్టీఆర్” అంటూ ఎన్టీఆర్ అభిమానులు నినాదాలు చేస్తున్న సమయంలో, ఎన్టీఆర్, “మీరు ఇలాగే అరిస్తే నేను వెళ్లిపోతాను,” అంటూ బెదిరించే ప్రయత్నం చేశారు. వెంటనే విజయశాంతి, ఎన్టీఆర్ చేతిని పట్టుకుని తన పక్కకు తీసుకొచ్చి నిలబెట్టుకున్నారు.
విజయశాంతి మాట్లాడుతూ, “అభిమానుల అభిమానం కంట్రోల్ చేయలేకపోతున్నాము,” అని అన్నారు. అప్పుడు ఎన్టీఆర్ తన అభిమానులను కంట్రోల్ చేయడం కనిపించింది. ఆమె మాట్లాడుతూ, “చాలా సంవత్సరాల నుంచి ‘రాములక్క, ఒక మంచి సినిమా చేయండి’ అని అనేకమంది అభిమానులు, మా అక్కా-చెల్లెలు, అందరూ అడుగుతున్నారు. ‘సరిలేరు నీకెవ్వరూ చేశాను కానీ అది సరిపోలేదు, ఇంకా ఏదైనా మంచి పాత్ర చేయండి’ అని కొన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నారు. నేను అనుకున్నాను, అంత మంచి పాత్ర అంటే ఎలా వస్తుంది? సబ్జెక్ట్ రావాలి, డైరెక్టర్ దొరకాలి, మంచి హీరో ఉండాలి. ఇలా అన్నీ కలిస్తే కదా ఒక మంచి పాత్ర, మంచి సబ్జెక్ట్ వస్తుంది,” అని అన్నారు. “అలాంటి సమయంలో డైరెక్టర్ ప్రదీప్ నా దగ్గరకు వచ్చి, ‘అమ్మ, ఈ సినిమా ఇలా అనుకుంటున్నాము. కళ్యాణ్ రామ్ గారు, మీరు తల్లి-కొడుకులుగా చేస్తే బాగుంటుంది,’ అని మాకు స్టోరీ చెప్పారు. అసలు నిజంగా నేను చేయకూడదనుకున్నాను. కానీ స్టోరీ విన్న తర్వాత, మా ఫ్యాన్స్ అడుగుతున్నారు, ఈ సినిమా చేస్తే వాళ్లు సంతృప్తి చెందుతారేమో అని అనుకుని, ‘సరే, చేస్తాను.
కానీ కొన్ని మార్పులు ఉండాలి,’ అని ప్రదీప్‌కి చెప్పాను. వారు విని, కళ్యాణ్ రామ్ గారి దగ్గరకు వెళ్లి, ‘విజయశాంతి గారు చేస్తానని ఒప్పుకున్నారు,’ అని చెప్పిన తర్వాత, అలా ఒక రూపం వచ్చింది. తర్వాత అశోక్, సునీల్ గారు నిర్మాతలుగా ఈ సినిమా మొదలైంది,” అని చెప్పారు. “నిజంగా పూర్తి హృదయంతో పనిచేస్తున్నప్పుడే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని అనుకున్నాము. చేసిన తర్వాత, ఎడిటింగ్ టేబుల్ నుంచి తమ్మి రాజు గారు ఫోన్ చేసి, ‘అమ్మ, నిజంగా అద్భుతంగా చేశారు. మీరు, కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌లో కొన్ని సీన్స్ ఉన్నాయి, కళ్లలో నీళ్లు వచ్చేశాయి. నిజంగా మనస్ఫూర్తిగా చెబుతున్నాను, ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందమ్మా. మీరు ధైర్యంగా ఉండండి,’ అని ఫస్ట్ రిపోర్ట్ ఎడిటింగ్ రూమ్ నుంచి మాకు వచ్చింది,” అని విజయశాంతి చెప్పారు.