యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గల్లీ రౌడీ’. పోసాని, వెన్నెల కిషోర్, బాబీ సింహ, రాజేంద్ర ప్రసాద్ ఈ చిత్రంలో కీలకపాత్రలలో నటిస్తున్నారు. జి నాగేశ్వర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతకుముందు సందీప్ కిషన్, నాగేశ్వర్ రెడ్డి కాంబినేషన్ లో ‘తెనాలి రామకృష్ణ బి.ఎ.బి.ఎల్’ చిత్రం తెరకెక్కింది. వీరిద్దరూ కలిసి మరోసారి ‘గల్లీ రౌడీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సాయి కార్తీక్, చౌరస్తా రామ్ సంయుక్తంగా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మే 21న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను ‘గల్లీ రౌడీ’ టీం అప్పుడే మొదలెట్టేసింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన మేకర్స్ ఇప్పుడు టీజర్ విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఏప్రిల్ 19న సాయంత్రం 5 గంటలకు ‘రౌడీ కా బాప్’ విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ‘గల్లీ రౌడీ’ టీజర్ ను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు నిర్మాతలు. కాగా ఇటీవలే ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ చిత్రంతో అంచనాలను అందుకోలేకపోయారు. హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్న సందీప్ కిషన్ ‘గల్లీ రౌడీ’గా మెప్పిస్తాడేమో చూడాలి.