ప్రస్తుతం ప్రేక్షకులు చాలా తెలివిగా మారిపోయారు. వారిని మెప్పించడానికి స్టార్ హీరోలు సైతం నానా తంటాలు పడుతున్నారు. ఇలాంటి టైం లో చిన్న హీరోల పరిస్థితి చాలా దారుణం అని చెప్పాలి. ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసిన హిట్ మాత్రం అందుకోలేకపోతున్నారు. అందులో విజయ్ దేవరకొండ ఒకరు. చివరిగా ‘ఖుషి’, ‘ఫ్యామిలి స్టార్’ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయాడు. దీంతో ఈ సారి ఎల్లా అయిన సక్సెస్ అందుకోవాలి అనే కసితో ‘కింగ్ డమ్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి ..
Also Read: Samantha : నాకు రూల్స్ పెడితే నచ్చదు..
ఇటివల విడుదలైన టీజర్ రౌడి హీరో ఫ్యాన్స్‌ని ఎంతో అకట్టుకుంది. విజయ్‌ని ఒక కొత్త కోణంలో చూపించాడు దర్శకుడు గౌతమ్. ఇక ఈ టీజర్‌కి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. అయితే తాజాగా విజయ్ దేవరకొండ ఎన్టీఆర్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.. ‘టీజర్ కోసం వాయిస్ ఓవర్ రాసినప్పుడే ఎన్టీఆర్ అన్న చెబితే బాగుంటుంది అనుకున్నాం. వెంటనే కలిసి ఇదే విషయం చెప్పాము ఆయన వెంటనే ఓకే అనేశారు. ఈ సాయంత్రం చేసేద్దాం అన్నారు. దర్శకుడు చెన్నైలో ఉన్నారని, టీజర్‌కు సంబంధించిన మ్యూజిక్ వర్క్‌లో బిజీగా ఉన్నారని చెప్పాము. ఏం పర్లేదు నువ్వు ఉన్నావు కదా అంటూ వచ్చి వాయిస్ ఓవర్ ఇచ్చారు. నా సినిమాకు తారక్ అన్న ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వడం నిజంగా నా అదృష్టం. హిందీలో రణబీర్ కపూర్, తమిళంలో సూర్య టీజర్‌కు వాయిస్ ఓవర్ ఇచ్చారు. వారికి కూడా స్పెషల్ థ్యాక్స్ చెబుతున్నాను’ అని తెలిపాడు.