Vijay Antony: ఆ కథ వినగానే కన్నీళ్లు ఆపుకోలేకపోయా.. స్టేజ్‌పైనే ఎమోషనల్ అయిన ‘బిచ్చగాడు’ హీరో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay Antony: వైవిధ్యభరితమైన కథలతో తెలుగు, తమిళ ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న హీరో, నిర్మాత విజయ్ ఆంటోనీ. ప్రస్తుతం ఆయన ‘వంద దేవుళ్లు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘బిచ్చగాడు’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత డైరెక్టర్ శశితో ఆయన కాంబినేషన్లో వస్తున్న ‘నూరు సామి’ (తెలుగులో ‘వంద దేవుళ్లు’) చిత్రం జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో హైదరాబాద్ జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ.. “డైరెక్టర్ శశి గారే 20 ఏళ్ల క్రితం ‘డిషుమ్’ సినిమాతో నన్ను మ్యూజిక్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆ తర్వాత సరిగ్గా పదేళ్లకు ‘బిచ్చగాడు’ లాంటి ఒక మైలురాయి లాంటి సినిమాను నా కెరీర్‌కు అందించారు. ఆ సినిమా నా పర్సనల్ లైఫ్‌ను, కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. నేను ఎన్ని ప్లాప్ సినిమాలు ఇచ్చినా, ఒక్కసారి టీవీలో బిచ్చగాడు సినిమా వస్తే చాలు.. జనాలు నన్ను మళ్లీ గుండెల్లో పెట్టేసుకుంటారు. నన్ను ఈ రెండు పరిశ్రమల్లో ఒక బలమైన నటుడిగా నిలబెట్టింది ఆ సినిమానే” అని ఎమోషనల్ అయ్యారు.
Also Read
కథ వింటూ ఏడ్చేశాను.. ఫస్ట్ టైమ్ లవర్ బాయ్‌గా..
“శశి గారు ఈ సినిమా కథ నాకు చెప్పినప్పుడు నేను కన్నీళ్లు ఆపుకోలేకపోయాను, ఏడ్చేశాను. నా కెరీర్లో ఇప్పటి వరకు 25 సినిమాలు చేశాను, ఎవరూ నన్ను నటుడిగా పెద్దగా మెచ్చుకోలేదు. కానీ, శశి గారు నన్ను ఈ సినిమాలో ఒక క్యూట్ లవర్ బాయ్‌గా చూపించారు. నా హీరోయిన్ కూడా నన్ను ‘చాలా క్యూట్’ అని ఆటపట్టించేది (నవ్వుతూ). ఇప్పుడు ఈ సినిమా చూసి చాలా మంది దర్శకులు నన్ను ‘లవర్ బాయ్’ అని పిలుస్తున్నారు. ఈ సినిమాలో నాది చాలా చిన్నదైనా, చాలా విభిన్నమైన పాత్ర” అని అన్నారు. తెలుగు డిస్ట్రిబ్యూషన్, డబ్బింగ్ బాధ్యతలను చూసుకుంటున్న భాష్యం గారిపై విజయ్ ఆంటోనీ ప్రశంసలు కురిపించారు. “తెలుగు ఇండస్ట్రీలో భాష్యం గారు నా బ్యాక్‌బోన్. ఆయన ఉన్నప్పుడు నేను తెలుగు డబ్బింగ్ లేదా ప్రమోషన్స్ గురించి అస్సలు టెన్షన్ పడను. ఒక నిర్మాత లాగా ఆయన బాధ్యత తీసుకుంటారు. నా కెరీర్లో ఆయన ప్లేస్మెంట్ చాలా ముఖ్యం” అన్నారు. అలాగే ఈ సినిమా ద్వారా కొత్త కెమెరామెన్, ఎడిటర్, మ్యూజిక్ డైరెక్టర్లను పరిచయం చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రం జూన్ 19న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోందని తెలిపారు.
తాజావార్తలు
-
Vijay Antony: ఆ కథ వినగానే కన్నీళ్లు ఆపుకోలేకపోయా.. స్టేజ్‌పైనే ఎమోషనల్ అయిన ‘బిచ్చగాడు’ హీరో..
-
Home Remedies : బంగాళాదుంప తొక్కలు పారేయొద్దు.. అందానికి బంగారు చిట్కా.!
-
Yemen: యెమెన్ ‘స్పైడర్ మ్యాన్’ ఓవరాక్షన్.. ఎంత పని చేశాడంటే..!
-
PM Modi: అమెరికా-ఇరాన్ ఒప్పందంపై మోడీ కీలక వ్యాఖ్యలు..
-
Chiranjeevi – Charan: ఇండియన్ సినీ హిస్టరీలోనే సరికొత్త అధ్యాయాన్ని సృష్టించిన చిరు-చరణ్
ట్రెండింగ్
-
HMD Vibe 2 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
11,000mAh బ్యాటరీతో రికార్డు దిశగా HONOR X80 Pro Max ఎంట్రీ.!
-
IND vs PAK: భారత్-పాక్ మ్యాచ్‌లో ఆటగాళ్ల మధ్య గొడవ.. వీడియో వైరల్.. ఇంతకీ ఏం జరిగిందంటే?
-
INDw vs PAKW: భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. వరల్డ్‌కప్ చరిత్రలోనే సరికొత్త రికార్డులు!
-
Deepti Sharma Record: దీప్తి శర్మ వరల్డ్ రికార్డ్.. అంతర్జాతీయ మహిళల టీ20ల్లోనే తోపు!