కోలీవుడ్ లోని అడోరబుల్ కపుల్స్ లో నయనతార, విఘ్నేష్ శివన్ ఒకరు. వీరిద్దరికి సంబంధించిన పిక్స్, న్యూస్ తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. దాదాపు గత ఆరేళ్లుగా వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోంది. తాజాగా విగ్నేష్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ సెషన్ ను నిర్వహించారు. ఇందులో నెటిజన్లు ఆయనను ఆసక్తికరమైన విషయాలను అడిగారు. ఓ నెటిజన్ మాత్రం “నయనతారతో మీ ఫేవరెట్ పిక్ ఏది?” అని అడిగారు. అందుకు సమాధానంగా తాను నయన్ ను నుదుటిపై ముద్దుపెట్టుకుంటున్న పిక్ ను షేర్ చేశాడు విగ్నేష్. ఆ పిక్ వారిద్దరూ యూఎస్ ట్రిప్ ను వెళ్ళినప్పటిది.
Also Read : ఇండియాలోనే మొదటి స్థానంలో “జగమే తందిరం”
“నయనతారలో మీకు నచ్చే క్వాలిటీస్ ఏంటి ?” అని అడిగాడు మరో నెటిజన్. అందుకు విగ్నేష్ “ఆమె సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సూపర్” అని సమాధానమిచ్చాడు. ఇక మరికొంతమంది నెటిజన్లు ఆయనను తన రాబోయే చిత్రాల గురించి అడిగారు. ప్రస్తుతం విగ్నేష్ శివన్ దర్శకత్వంలో నయనతార హీరోయిన్ గా “కాతువాకుల రెండు కాదల్” అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో విజయ్ సేతుపతి, సమంత అక్కినేని కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పుడు కరోనా కేసులు నెమ్మదిగా తగ్గుతుండడంతో సినిమా, టెలివిజన్ షూటింగ్‌లకు తమిళనాడు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుంది.