‘మధ్యప్రదేశ్ అడవుల్లో ఏం జరిగింది?’ వివరిస్తానంటోన్న విద్యా బాలన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విద్యా బాలన్ నెక్ట్స్ తెరపై కనిపించబోయే సినిమా ‘షేర్నీ’. దట్టమైన అడవుల మధ్య నరమాంసానికి అలవాటు పడ్డ ఒక పులిని పట్టుకోవటమే సినిమాలోని కథ. క్రూర జంతువుని ఎదుర్కొనే అటవీశాఖ అధికారిణిగా విద్యా నటించింది. అనుక్షణం థ్రిల్ కలిగించే కథతో దర్శకుడు అమిత్ మసుర్కర్ ఈ సినిమాని రూపొందించాడు. అయితే, జూన్ 18న అమేజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవ్వనున్న డీప్ ఫారెస్ట్ ఎంటర్టైనర్ పై మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా దృష్టి పెట్టటం విశేషం…
‘షేర్నీ’ సినిమా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో షూట్ చేశారు. ముఖ్యంగా, అక్కడి అరణ్యాలు, గిరిజన ప్రాంతాలు విరివిగా కెమెరాలో బంధించారు. అందుకే, రానున్న రోజుల్లో ఎంపీ ప్రభుత్వం ‘షేర్నీ’ నటీనటులు, టెక్నీషియన్స్ తో పలు కార్యక్రమాలు రూపొందించనుంది. వాటి ద్వారా తమ రాష్ట్ర పర్యాటక రంగానికి ప్రచారం ఏర్పడుతుందని మధ్యప్రదేశ్ టూరిజమ్ అఫీషియల్స్ చెబుతున్నారు. విద్యా బాలన్ తో పాటూ సినిమా దర్శకుడు, ఇతర సెలబ్రిటీస్ ఆ రాష్ట్రంలో చీత్రకరణ జరిపినప్పుడు తమకు కలిగిన అనుభవాలు, అనుభూతులు పంచుకోనున్నారు.
మధ్యప్రదేశ్ లోని దట్టమైన, అందమైన అడవులు, అక్కడి గిరిజనుల మధ్య షూటింగ్ ఓ మరిచిపోలేని అనుభూతి అన్న విద్యా బాలన్ ప్రచార కార్యక్రమాలు ఎలా ఉంటాయో స్పష్టంగా చెప్పలేదు. కానీ, ‘షేర్నీ’ విడుదలకు ముందు సినిమా ప్రమోషన్ లో భాగంగా ఎంపీ టూరిజమ్ శాఖతో కలసి పని చేయబోతున్నట్టు ఆమె వివరించారు. రకరకాల స్థాయుల్లో అనేక కార్యక్రమాలు చేపడతామని అధికారులైతే అంటున్నారు. చూడాలి మరి, ‘షేర్నీ’ మధ్యప్రదేశ్ పర్యాటక శాఖకి ఎలా ఉపయోగపడుతుందో…
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
తాజావార్తలు
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Mohammad Kaif: రోహిత్, కోహ్లీ కాదు.. 2027 వరల్డ్ కప్ గెలవాలంటే భారత్‌కు ఇదే కీలకం..
-
APPSC: నిరుద్యోగులకు శుభవార్త.. ఏపీపీఎస్సీ నుంచి 5 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల..
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Steve Smith: డర్బన్ టెస్ట్‌లో ఊహించని పరిణామం.. స్టీవ్ స్మిత్‌కు గాయం..
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?