బాలీవుడ్ స్టార్ విక్కి కౌశల్ గురించి పరిచయం అక్కర్లేదు. సినిమా బ్యాగ్రౌండ్ నుండి వచ్చినప్పటికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించాడు. ఆ తర్వాత చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ, 2015ల మాసాన్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు. తర్వాత వరుస చిత్రాలో నటించిన విక్కీ రీసెంట్‌గా ‘ఛావా’ సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌కి ఎదిగాడు. ఛత్రపతి శివాజీ మహరాజ్ తనయుడు శంభాజీ మహరాజ్ జీవిత కథగా తెరకెక్కిన ఈ సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో వహించగా, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. విక్కీ కౌశల్ నటన వేరే లెవల్ అని చెప్పాలి..ప్రతి ఒక్కరి నుంచి ప్రశంసలు అందుకున్నారు. అయితే ప్రస్తుతం వరుస చిత్రాలతో దూసుకుపోతున్న ఈ యంగ్ హీరో గతంలో రెండు సార్లు జైలుకు వెళ్లినట్లు తాజాగా డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ వెల్లడించారు.
Also Read : Simbu : మణిరత్నం నన్ను పూర్తిగా మార్చేశాడు..
అసలు ఏం జరిగింది అంటే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనురాగ్ ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటు పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.. ‘ ‘గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు విక్కి. అయితే ఎలాంటి పర్‌మీషన్ లేకుండా ఒక ప్రదేశంలో షూటింగ్ చేశాము.. అప్పుడు అది అక్రమ ఇసుక గని అని తెలిసింది. ఇసుక మాఫియా జరిగిన ఆ ప్రదేశంలో కాల్పులు జరిపినందుకు విక్కీ రెండు సార్లు అరెస్ట్ అయ్యాడు. అలా రెండు సార్లు జైలుకు వెళ్లాల్సి వచ్చింది’ అని అనురాగ్ వెల్లడించారు. ప్రజంట్ ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.