హాప్పర్.కామ్ ఇన్‌స్టాగ్రామ్ రిచ్‌లిస్ట్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ లిస్ట్ లో ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో అగ్రస్థానంలో ఉన్నాడు. ప్రపంచంలో అత్యధికంగా సంపాదించే ప్రముఖుల పేర్లను కలిగి ఉన్న ఈ జాబితాలో ముగ్గురు భారతీయులు ఉన్నారు. అందులో విరాట్ కోహ్లీ, ప్రియాంక చోప్రా జోనాస్ ఉండగా… అందరికీ షాకిస్తూ టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ దగ్గుబాటి కుమార్తె అశ్రిత కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషంగా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో చేసే పోస్టుల ద్వారా భారీగా ఆదాయం పొందుతున్న వారిలో వెంకటేష్ కుమార్తె కూడా ఉంది.
Read Also : వైరల్ వీడియో: ప్రగ్యా జైస్వాల్ వెంటపడ్డ యాచకులు
ఆమె ఆహార రంగంలో వ్యాపారవేత్తగా రాణించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆశ్రితకు 1,36,359 మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె ప్రతి పోస్టుకు $400 తీసుకుంటుంది. అంటే రూ.31,000 అన్నమాట. హాప్పర్ జాబితా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అశ్రిత 377వ స్థానంలో, ఆసియాలో 27వ స్థానంలో ఉంది. వెంకటేష్ కుమార్తె ఈ ఘనత సాధించడం తెలుగు మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అశ్రిత వినాయక్ రెడ్డిని వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఆమె బార్సిలోనాలో నివసిస్తోంది. ఆమె ‘ఇన్ఫినిటీ ప్లాటర్’ అనే బ్రాండ్‌తో ఆహార వ్యాపారాన్ని నిర్వహిస్తోంది.