హాప్పర్.కామ్ ఇన్‌స్టాగ్రామ్ రిచ్‌లిస్ట్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ లిస్ట్ లో ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో అగ్రస్థానంలో ఉన్నాడు. ప్రపంచంలో అత్యధికంగా సంపాదించే ప్రముఖుల పేర్లను కలిగి ఉన్న ఈ జాబితాలో ముగ్గురు భారతీయులు ఉన్నారు. అందులో విరాట్ కోహ్లీ, ప్రియాంక చోప్రా జోనాస్ ఉండగా… అందరికీ షాకిస్తూ టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ దగ్గుబాటి కుమార్తె అశ్రిత కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషంగా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో చేసే పోస్టుల ద్వారా…