Comrade Kalyan : ‘కామ్రేడ్ కళ్యాణ్’ వాయిదా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్టోబర్ 2న రావాల్సిన ‘ఆదర్శ కుటుంబం’, వారం రోజులు ఆలస్యంగా తొమ్మిదిన థియేటర్లలోకి వస్తుంది. మరి, తొమ్మిదిన రావాల్సిన యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ వాయిదా పడుతుందా? ‘ఆదర్శ కుటుంబం’ రెండున రాకపోవడంతో చిన్న సినిమాలు ఊపిరి పీల్చుకున్నాయి. పాన్ ఇండియా మూవీ, స్టార్ హీరోల సినిమాలే కాదు, సీనియర్ హీరో వెంకటేష్ మూవీ ‘ఆదర్శ కుటుంబాని’కి కూడా రిలీజ్ వాయిదా తప్పలేదు. గాంధీ జయంతికి వచ్చి దసరా హాలిడేస్ వరకు లాంగ్ రన్ ఉంటుంది అనుకుంటే, ఒక వారం ఆలస్యంగా తొమ్మిదిన రిలీజ్ అవుతుంది. అయితే, అదే రోజు రావాలని డేట్ ఫిక్స్ చేసుకున్న శ్రీవిష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’ వాయిదా పడక తప్పదు. ‘ఆదర్శ కుటుంబాని’కి ధీటుగా రిలీజ్ చేసే ఛాన్స్ శ్రీవిష్ణు తీసుకోవడం లేదు.
అందులోనూ సినిమా సెన్సార్ రివైజింగ్ కమిటీకి వెళ్ళడంతో, ‘కామ్రేడ్ కళ్యాణ్’ రిలీజ్పై ముందునుంచి డౌట్ ఉంది. ఒకవేళ సెన్సార్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడినా, ‘ఆదర్శ కుటుంబాన్ని’ డీకొట్టడం కష్టమే. పోనీ వారం తర్వాత వద్దామనుకుంటే.. అక్టోబర్ 15న ‘జైలర్ 2’, 16న ‘రణబాలి’ రిలీజ్ అవుతున్నాయి. ఈ లెక్కన ‘కామ్రేడ్’ మరో రిలీజ్ డేట్ చూసుకోవాల్సిందే. ‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్ వాయిదా పడడం చిన్న సినిమాలకు కలిసి వచ్చింది. రాజమౌళి ప్రెజెంటర్గా నిర్మించిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ఎలాంటి పోటీ లేకుండా థియేటర్స్లోకి రానుంది. ఫహద్ ఫాజిల్ నటించిన ఈ చిత్రం తెలుగు, మలయాళంలో రూపొందింది. విజయ్ కొడుకు జాసన్ డైరెక్షన్లో రూపొందిన సినిమా కూడా ఇదే రోజు రిలీజ్ అవుతుంది. అలాగే, చిన్న సినిమా ‘తెల్ల కాగితం’కు కావలసినన్ని థియేటర్స్ దొరకనున్నాయి.
Also Read
తాజావార్తలు
-
Israel: ఇజ్రాయిల్ వెళ్లే విమానాల్లో పాక్ పైలట్లు, సిబ్బందిపై నిషేధం..!
-
DRDO QKD test: DRDO కీలక విజయం.. క్వాంటం టెక్నాలజీతో రక్షణ సమాచారానికి మరింత భద్రత!
-
AP Local Body Election Schedule 2026: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. పూర్తి షెడ్యూల్ ఇదే..
-
Yash: చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తున్న యష్?
-
Airtel rs348 vs rs349 Recharge Plan: కేవలం రూ.1 తేడా.. ఎయిర్టెల్లో రూ.348, రూ.349 ప్లాన్స్.. ఏది బెస్ట్ అంటే?
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..