Vasudeva Sutham: దేవుడి అస్థిత్వాన్ని ప్రశ్నిస్తే భూమ్మీద బతికే హక్కు లేదు!

Vasudevasutham.

Vasudevasutham.

టాలీవుడ్‌లో భక్తి, అడ్వెంచర్ మిస్టరీ జోనర్‌ సినిమాలకు ఎప్పుడూ ఉండే క్రేజే వేరు. ఇప్పుడు అదే బాటలో ఒరిస్సాలోని ఓ పురాతన ఆలయ రహస్యాల నేపథ్యంలో తెరకెక్కిన సరికొత్త మైథలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘వసుదేవసుతం’. ‘పెదరాయుడు’, ‘దేవి’ వంటి చిత్రాలతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెప్పించిన మాస్టర్ మహేంద్రన్, అంబికా వాణి జంటగా నటించిన ఈ చిత్రాన్ని రెయిన్‌బో సినిమాస్ బ్యానర్ మీద ధనలక్ష్మి బాదర్ల నిర్మించారు. వైకుంఠ్ బోను దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలై 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ మంగళవారం నాడు ఈ సినిమా హై-వోల్టేజ్ ట్రైలర్‌ను విడుదల చేసింది.

ఒరిస్సాలోని ప్రముఖ వాసుదేవుని ఆలయం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ఆ గుడిలో ఉండే అత్యంత పవిత్రమైన ‘బ్రహ్మ పదార్థం’ దక్కించుకోవాలని కొన్ని అంతర్జాతీయ శత్రు మూకలు కుట్రలు పన్నుతుంటాయి. ఆ ముఠా విన్యాసాలను, దైవ ద్రోహాన్ని అడ్డుకునే పవర్‌ఫుల్ పాత్రలో హీరో మాస్టర్ మహేంద్రన్ యాక్షన్ సీక్వెన్స్‌లలో అదరగొట్టేశారు. ట్రైలర్‌లో వినిపించిన “ఆయుధం వస్తోంది”.. “దేవుడి అస్థిత్వాన్ని ప్రశ్నించే ఎవ్వడికీ భూమ్మీద బతికే హక్కు లేదు” అనే డైలాగ్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. ముఖ్యంగా ట్రైలర్ చివర్లో వచ్చే గరుత్మంతుడి విజువల్ షాట్, దానికి తోడు ‘మెలోడీ బ్రహ్మ’ మణిశర్మ ఇచ్చిన మైండ్ బ్లోయింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా స్కై హైకి తీసుకెళ్లాయి.

×
×
Ad