Vasudeva Sutham: దేవుడి అస్థిత్వాన్ని ప్రశ్నిస్తే భూమ్మీద బతికే హక్కు లేదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో భక్తి, అడ్వెంచర్ మిస్టరీ జోనర్ సినిమాలకు ఎప్పుడూ ఉండే క్రేజే వేరు. ఇప్పుడు అదే బాటలో ఒరిస్సాలోని ఓ పురాతన ఆలయ రహస్యాల నేపథ్యంలో తెరకెక్కిన సరికొత్త మైథలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘వసుదేవసుతం’. ‘పెదరాయుడు’, ‘దేవి’ వంటి చిత్రాలతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెప్పించిన మాస్టర్ మహేంద్రన్, అంబికా వాణి జంటగా నటించిన ఈ చిత్రాన్ని రెయిన్బో సినిమాస్ బ్యానర్ మీద ధనలక్ష్మి బాదర్ల నిర్మించారు. వైకుంఠ్ బోను దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలై 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ మంగళవారం నాడు ఈ సినిమా హై-వోల్టేజ్ ట్రైలర్‌ను విడుదల చేసింది.
ఒరిస్సాలోని ప్రముఖ వాసుదేవుని ఆలయం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ఆ గుడిలో ఉండే అత్యంత పవిత్రమైన ‘బ్రహ్మ పదార్థం’ దక్కించుకోవాలని కొన్ని అంతర్జాతీయ శత్రు మూకలు కుట్రలు పన్నుతుంటాయి. ఆ ముఠా విన్యాసాలను, దైవ ద్రోహాన్ని అడ్డుకునే పవర్ఫుల్ పాత్రలో హీరో మాస్టర్ మహేంద్రన్ యాక్షన్ సీక్వెన్స్‌లలో అదరగొట్టేశారు. ట్రైలర్లో వినిపించిన “ఆయుధం వస్తోంది”.. “దేవుడి అస్థిత్వాన్ని ప్రశ్నించే ఎవ్వడికీ భూమ్మీద బతికే హక్కు లేదు” అనే డైలాగ్స్ గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి. ముఖ్యంగా ట్రైలర్ చివర్లో వచ్చే గరుత్మంతుడి విజువల్ షాట్, దానికి తోడు ‘మెలోడీ బ్రహ్మ’ మణిశర్మ ఇచ్చిన మైండ్ బ్లోయింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా స్కై హైకి తీసుకెళ్లాయి.
Also Read
- Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. "నా బిడ్డకు దక్కిన వరం" అంటూ ఎమోషనల్ పోస్ట్!
- The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. 'ది ప్యారడైజ్' షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
- Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్‌గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
- Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
తాజావార్తలు
-
Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్‌ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
-
Smart Phone Prices: ఇకపై స్మార్ట్ఫోన్లు మరింత చీప్? 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గనున్న జీఎస్టీ..?
-
India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
-
Trump: తెలివైన అధ్యక్షుడు ఉండగా ఏఐకి కళ్లెం వేయక్కర్లేదు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
Cupid Limited Share Price: కండోమ్‌లు అమ్మే కంపెనీ.. స్టాక్ మార్కెట్లో కోటీశ్వరులను చేసేసింది.. ఎలా అంటే..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!