Priyanka Chopra: నిక్‌లో నిజాయతీ ఉంది.. ఆరు నెలల్లోనే పెళ్లి.. రూమర్లు ఎందుకు వస్తున్నాయో!
- ‘వారణాసి’లో కథానాయికగా గ్లోబల్ హీరోయిన్ ప్రియాంక చోప్రా
- విడిపోతున్నారంటూ వస్తున్న వార్తలపై స్పందించిన ప్రియాంక
- రూమర్లు ఎందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్ ప్రాజెక్టులతో పాటు ఎస్ఎస్ రాజమౌళి-మహేశ్ బాబు కాంబినేషన్‌లో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’లో కథానాయికగా నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవల వారణాసి షూటింగ్‌లో పాల్గొన్న ప్రియాంక.. ప్రస్తుతం చిన్న బ్రేక్ తీసుకున్నారట. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ప్రియాంక తన వ్యక్తిగత జీవితం, వైవాహిక బంధంపై వస్తున్న పుకార్లపై ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ విడిపోతున్నారంటూ వస్తున్న వార్తలపై ఆమె గట్టిగానే స్పందించారు. ‘మేము విడాకులు తీసుకుంటున్నామంటూ కొన్ని వార్తలు నా చెవిన పడ్డాయి. మా పెళ్లి బంధం ముగిసిపోవాలని కొందరు కోరుకుంటున్నారా? అనిపిస్తోంది. అసలు మా బంధం గురించి ఇలాంటి రూమర్లు ఎందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదు. ఇదంతా వారి భ్రమ మాత్రమే. వేర్వేరు దేశాలు, వేర్వేరు మతాలు, మా మధ్య ఉన్న వయసు తేడా వల్ల కొందరికి మా బంధం ఇబ్బందిగా అనిపిస్తుండవచ్చు. కానీ మేము ఎనిమిదేళ్లుగా కలిసే ఉంటున్నాం. ఇతరులు ఏమనుకుంటున్నారో అని ఆలోచించడం నేను ఎప్పుడో మానేశాను’ అని ప్రియాంక చెప్పుకొచ్చారు.
Also Read
- Shah Rukh Khan: బాలీవుడ్ చరిత్రను సొంతం చేసుకున్న బాద్షా.. అరుదైన 'మొఘల్-ఎ-ఆజమ్' పోస్టర్ల కోసం లక్షలు ఖర్చు!
- Dhanush: ధనుష్ బర్త్‌డే రోజే ‘ఓం’ రిలీజ్ డేట్ ట్విస్ట్.. ‘జైలర్ 2’తో క్లాష్ తప్పించుకుంటుందా?
- Pyaar Prema Kalyanam OTT: పెళ్ళాం ఇంటికి మకాం మార్చే మొగుడు... ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్..
- Sri Sri: దుల్కర్ సల్మాన్, పూజా హెగ్దే కెమిస్ట్రీ అదిరిపోయిందిగా.. 'శ్రీ శ్రీ' నుంచి 'బొమ్మ బొమ్మ' సాంగ్ రిలీజ్.!
తమ వివాహ ప్రయాణం గురించి ప్రియాంక చోప్రా చెబుతూ… ‘మా పరిచయం తర్వాత కేవలం ఆరు నెలల్లోనే పెళ్లి చేసుకున్నాం. అప్పట్లో అసలు ఏం జరుగుతుందో, అది నిజమో కాదో కూడా తెలియని అయోమయ స్థితిలో ఉన్నాను. అయితే నిక్‌లో ఉన్న నిజాయతీ నన్ను ఆకర్షించింది’ అని చెప్పారు. కుటుంబ భద్రత విషయంలో తాను చాలా కఠినంగా ఉంటానని తెలిపారు. ‘నేను నా కుటుంబం, ముఖ్యంగా నా కుమార్తె భద్రత విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను. ఎవరైనా నన్ను నేరుగా కలిసి ఫొటోలు తీసుకోవాలనుకుంటే నాకు ఇష్టమే. నాతో మాట్లాడటానికి వచ్చే వ్యక్తులను నేను గౌరవిస్తానని నా సెక్యూరిటీ గార్డులకు కూడా తెలుసు. కానీ అనుమతి లేకుండా దొంగ చాటుగా ఫొటోలు తీయడం నాకు నచ్చదు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర సెల్‌ఫోన్లు ఉంటున్నాయి. మేము పార్కులో ఉన్నా లేదా ఎక్కడైనా భోజనం చేస్తున్నా.. ఆ పిక్స్ వెంటనే సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అందుకే నా కూతురి ప్రైవసీ కోసం సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నాను. లేకపోతే నాకు వ్యక్తిగత భద్రత అవసరం లేదు’ అని వివరించారు.
తాజావార్తలు
-
3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, 165Hz రిఫ్రెష్ రేట్ తో రాబోతున్న iQOO Z11 5G..!
-
Shah Rukh Khan: బాలీవుడ్ చరిత్రను సొంతం చేసుకున్న బాద్షా.. అరుదైన ‘మొఘల్-ఎ-ఆజమ్’ పోస్టర్ల కోసం లక్షలు ఖర్చు!
-
Saransh Jain: భారత జట్టులోకి దేశవాళీ మాన్స్టర్.. ఎవరీ సరాంశ్ జైన్?.. అంత తోపు ప్లేయరా?
-
Rule Changes from August 1: ఆగస్టు 1 నుంచి రానున్న కొత్త రూల్స్ ఇవే.. LPG ధరల నుంచి తత్కాల్ రైలు టికెట్ల వరకు
-
Dhanush: ధనుష్ బర్త్‌డే రోజే ‘ఓం’ రిలీజ్ డేట్ ట్విస్ట్.. ‘జైలర్ 2’తో క్లాష్ తప్పించుకుంటుందా?
ట్రెండింగ్
-
Sanju Samson: ఎలుకల పందెంలో పరుగెత్తలేను.. ఎలా ఆడాలో ఎవరూ చెప్పక్కర్లేదు.. సంజు సంచలన వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన POCO M8 Power 5G.!
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్‌మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!