సోషల్ మీడియా నుంచి గుర్తింపు తెచ్చుకొన్ని హీరోయిన్ వరకు ఎదగడం అంటే మామూలు విషయం కాదు. అందులోను మన టాలీవుడ్ సినిమా దగ్గర చిన్న చిన్న పాత్రలకి తెలుగు హీరోయిన్స్‌ని తీసుకోవడం కూడా గగనం. ఇలాంటి పరిస్థితులను దాటుకుని కొందరు తెలుగు అమ్మాయిలు తమ సత్తా చాటుతున్నారు.ఈ లిస్ట్‌లో వైష్ణవి చైతన్య ఒకరు. యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మీ కానుండి .. సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి.. చివరకు ‘బేబి’ మూవీలో హీరోయిన్‌గా ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ప్రజంట్ వరుస ప్రాజెక్ట్ లు చేస్తుంది. అయితే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు తన జర్నీ గురించి చెప్పుకుంది..
Also Read: #Akhil 6 : టైటిల్ గ్లింప్స్ రిలీజ్ టైమ్ రివీల్ చేసిన నాగవంశీ..
‘చిన్నప్పటి నుండి నేను యాక్టర్ అవ్వాలి అలా ఏం అనుకోలేదు. కానీ మా తాతయ్య ఇంకా మా నాన్నకు సినిమాలు అంటే పిచ్చి. వారి నుండి నాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. లైఫ్‌లో ఏదైనా మనకు తొందరగా దక్కితే దానికి విలువ ఉండదు.. కష్ట పడాలి. నేను అందరిలాగానే చాలా ఇబ్బందులు పడ్డాను జాబ్ చేస్తూ వచ్చిన డబ్బులతో బట్టలు కొనుక్కుని, చిన్న చిన్న విడియోలు, షార్ట్ ఫిలిమ్స్ ఇలా ఏ ఒక్క అవకాశం కూడా వదులుకోలేదు.అలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలో ఆఫర్స్ వచ్చాయి. అప్పుడు కొంచెం నమ్మకం పెరిగింది. అలా నా జర్ని ఇక్కడి వరకు వచ్చింది. యూట్యూబర్స్ అంటే వారి బాధలు మాములుగా ఉండవు. ది బెస్ట్ ఇవ్వాలి అని ఉంటుంది కానీ సరైన బడ్జెట్ మాత్రం ఉండదు. షూటింగ్ టైంలో నేను పార్క్ లలో వాష్ రూమ్‌లో బట్టలు మార్చుకున రోజులు కూడా ఉన్నాయి’ అంటూ తన కెరీర్ గురించి చెప్పుకొచ్చింది.