‘వద్దురా సోదరా’ మోషన్ పోస్టర్ విడుదల!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ యువ కథానాయకుడు రిషి టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సినిమా ‘వద్దురా సోదరా’. ఇందులో ధన్యా బాలకృష్ణన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఓ వినూత్న ప్రేమకథతో దర్శకుడు ఇస్లాహుద్దీన్ ఈ చిత్రాన్ని రూపొందించారు. కన్నడ, తెలుగు ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన దీనిని స్వేచ్ఛా క్రియేషన్స్, స్టాబ్ ఫాబ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా తెలుగులోకి తీసుకొస్తున్నాయి. ధీరజ్ మొగిలినేని, అమ్రేజ్ సూర్యవంశీ నిర్మాతలు. సోమవారం ఉదయం ‘వద్దురా సోదరా’ సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఈ మోషన్ పోస్టర్ చూస్తే… ప్రేయసికి దూరమైన ఓ ప్రేమికుడి బాధ కనిపిస్తుంది. ‘నా ప్రేయసి తనకు ఇష్టంలేని వాడిని పెళ్లి చేసుకున్నప్పుడు, నేను లేకుండా తను ఎప్పుడూ సంతోషంగా ఉండలేనని చెప్పింది. అప్పటి నుంచి నేను కూడా సంతోషంగా ఉండటం మానేశాను. కానీ ఇప్పుడు ఒక సంతోషపు ముసుగు వేసుకుని బ్రతుకుతున్నాను’ అంటూ ఆ విఫల ప్రేమికుడు తన మనో వేదనను చెబుతాడు. దాంతో ఇదో పెయిన్ ఫుల్ లవ్ స్టోరీ అనేది అర్థమౌతోంది. ఈ మోషన్ పోస్టర్ కోసం హీరో రిషితోనే తెలుగు డబ్బింగ్ చెప్పించినట్టున్నారు. పదాలన్నీ పట్టిపట్టి పలికినట్టుగా తెలిసిపోతోంది.
నాగభూషణ, గ్రీష్మ శ్రీధర్, మహదేవ్ ప్రసాద్, భవానీ ప్రకాష్, అపూర్వ ఎస్ భరద్వాజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: విష్ణు ప్రసాద్ పి, దిలీప్ కుమార్ ఎంఎస్, సంగీతం: ప్రసన్న శివరామన్.
Also Read
- Varanasi-Mahesh Babu: ఇంకా ఒక వారమే.. మహేష్ బాబు 'వారణాసి' నుంచి క్రేజీ అప్డేట్!
- Indian Cinema: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ సినిమాలు
- Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
- Peddi - Irumudi: 'పెద్ది' ఓడిపోయింది.. 'ఇరుముడి' గెలవలేకపోయింది!
తాజావార్తలు
-
Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
-
Varanasi-Mahesh Babu: ఇంకా ఒక వారమే.. మహేష్ బాబు ‘వారణాసి’ నుంచి క్రేజీ అప్డేట్!
-
Motorola Signature 27: మోటరోలా Signature 27 లాంచ్ డేట్ కన్ఫర్మ్.. 200MP కెమెరా, Dolby Vision సపోర్ట్, ప్రీమియం డిజైన్
-
PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
-
West Bengal Bypolls: మమతా బెనర్జీకి మరో షాక్.. రేజీనగర్ అభ్యర్థి కూడా బరి నుంచి ఔట్
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!