‘మెరిసే మెరిసే’ యూనిట్‌ను వి. వి. వినాయక్ విషెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘హుషారు’ ఫేమ్ దినేష్ తేజ్, శ్వేతా అవస్తి జంటగా నటించిన సినిమా ‘మెరిసే మెరిసే’. పవన్ కుమార్ కె. దర్శకత్వంలో వెంకటేష్ కొత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. లవ్, కామెడీ, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘మెరిసే మెరిసే’ చిత్రం పీవీఆర్ పిక్చర్స్ ద్వారా ఆగస్టు 6న థియేటర్లలో విడుదల కాబోతోంది. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ను చూసి, చిత్ర బృందాన్ని టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వి. వి. వినాయక్ అభినందించారు. ఈ సందర్భంగా వినాయక్ మాట్లాడుతూ ”డైరెక్టర్ పవన్ రాజమండ్రి కుర్రాడు. మా నాన్నగారి స్నేహితుడు సుబ్బరాజు గారి అబ్బాయి. అతను ‘మెరిసే మెరిసే’ మూవీతో దర్శకుడిగా పరిచయం కావడం ఆనందంగా ఉంది. ‘హుషారు’ చిత్రంలో నటించిన దినేశ్ ఇందులో హీరోగా నటించాడు. ఈ సినిమాకు పనిచేసిన యూనిట్‌లో చాలా మంది రీసెంట్ సినిమాల్లో పనిచేసినవారే. ఓ మంచి టీమ్ చేసిన ఈ ప్రయత్నం డెఫనెట్‌గా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని అన్నారు.
దర్శకుడు పవన్ కుమార్ మాట్లాడుతూ ”యుక్తవయసులో అమ్మాయి, అబ్బాయిల మనసులు సునిశితంగా ఉంటాయి. అలాంటి వారు కలిసి చేసే ప్రయాణంలో ఎలాంటి ఒడిదొడుకులను ఎదుర్కొన్నారు, ఎలా సక్సెస్ అయ్యారనే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. అందరికీ మా సినిమా నచ్చుతుందనే నమ్మకం ఉంది” అని అన్నారు. హీరో దినేశ్ తేజ్ మాట్లాడుతూ ”కోవిడ్ సమయంలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి సినిమాను విడుదల చేస్తున్నాం. ఇండస్ట్రీ నుంచి చక్కటి మద్దతు లభించింది. వినాయక్ వంటి పెద్ద డైరెక్టర్ మా యూనిట్‌ను అభినందించడమే అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. ‘మెరిసే మెరిసే’ చక్కటి మూవీ. ప్లెజంట్ గా ఉంటుంది. థియేటర్ లలో చూసి ఆశీర్వదిస్తారని భావిస్తున్నాం” అని చెప్పారు.
Also Read
- Gondhal: ఆస్కార్ బరిలో మరాఠీ మూవీ.. బాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టిన ‘గోంధల్’..
- Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
- The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
- Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
తాజావార్తలు
-
Gondhal: ఆస్కార్ బరిలో మరాఠీ మూవీ.. బాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టిన ‘గోంధల్’..
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..