ప్రభాస్ స్నేహితులు, సన్నిహితుల ఆధ్వర్యంలో నడుస్తున్న యూవీ క్రియేషన్స్ సంస్థ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు సదరు సంస్థ నిర్మించింది. తాజాగా ఈ సంస్థ అదొక అధికారిక ప్రకటన విడుదల చేసింది. దాని ప్రకారం, ఒక గుర్తు తెలియని వ్యక్తి మా కంపెనీ ప్రతినిధినని చెప్పుకుంటూ నటీమణులను వారి ప్రతినిధులను కలిసి ఫ్రాడ్ ఆఫర్‌లు ఇస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. మేము ఒకటే చెప్పాలనుకుంటున్నాం: సదరు వ్యక్తికి యూవీ క్రియేషన్స్ సంస్థకు ఎలాంటి సంబంధం లేదు.
Also Read:Chiru – Charan : హరిహర ట్రైలర్ పై చిరు – చరణ్ రియాక్షన్ ఇదే
ఎలాంటి అధికారిక సమాచారం అయినా లేదా కాస్టింగ్ సంబంధిత ప్రక్రియ అయినా ఉంటే, కచ్చితంగా అధికారిక ఛానెల్‌ల ద్వారా మాత్రమే చేస్తాం. సినీ పరిశ్రమలో కూడా అందరూ జాగ్రత్తగా ఉండాలని, వారితో ఎంగేజ్ అయ్యే ముందు వారిని ఎంతవరకు తెలుసుకోవాలని హెచ్చరిస్తున్నాం. నిజంగా మా సంస్థకు నటీమణులు అవసరమైతే, జెన్యూన్ ఇండస్ట్రీ సోర్సెస్ ద్వారా మాత్రమే ఆ సమాచారాన్ని షేర్ చేస్తాం. మా పేరును, బ్రాండ్‌ను మిస్యూజ్ చేస్తున్న ఈ వ్యవహారంపై మేము సీరియస్‌గా ఉన్నాం. కచ్చితంగా ఈ వ్యవహారం ఏమిటో తేలుస్తామని యూవీ క్రియేషన్స్ సంస్థ అధికారికంగా హెచ్చరిక జారీ చేసింది. 