Site icon NTV Telugu

Ustaad Bhagat Singh: మార్పులు చేర్పులతో కానిచ్చేస్తున్నారా?

Ustaad

Ustaad

పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. రీమేక్ స్పెషలిస్ట్‌గా పేరు ఉన్న హరీష్ శంకర్ ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు. నిజానికి ఈ సినిమా మొదలైనప్పుడు తమిళ్ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటించిన, అట్లీ డైరెక్ట్ చేసిన తేరి అనే సినిమాకి రీమేక్‌గా మొదలుపెట్టారు. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ కావడంతో సినిమా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలోనే హిందీలో అదే సినిమా రీమేక్ బేబీ జాన్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్‌గా నిలిచింది.

Also Read:Sukumar : సుకుమార్ లెక్కలను ఫాలో అవుతున్న డైరెక్టర్లు..!

దీంతో వెంటనే హరీష్ శంకర్ ఈ సినిమాను ఫ్రేమ్ టు ఫ్రేమ్ రీమేక్ చేయకూడదని నిశ్చయమై, సినిమాకి సంబంధించి అనేక మార్పులు, చేర్పులు చేసినట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత షూటింగ్ కూడా మొదలైంది. అయితే ఒక హీరోయిన్‌తోనే అని అందరూ భావిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మరో హీరోయిన్ రంగంలోకి దిగింది. హీరోయిన్ ఒక్కరే అనుకున్న సమయంలో తేరి సినిమాకి చాలా వ్యత్యాసంగా ఈ సినిమా ఉంటుందని అందరూ భావించారు. ఇప్పుడు రాశి ఖన్నా కూడా సీన్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఈ సినిమా కూడా తేరికి దగ్గరగానే ఉంటుందా అనే అనుమానాలు మొదలవుతున్నాయి.

Also Read:AP: ప్రభుత్వం గుడ్ న్యూస్.. మున్సిపల్ శాఖలో వర్కర్ల వేతనం పెంపు

ఒరిజినల్ సినిమాలో విజయ్ భార్య పాత్రలో సమంత నటించగా, టీచర్ పాత్రలో ఎమీ జాక్సన్ నటించింది. ఇప్పుడు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ భార్య పాత్రలో రాశి ఖన్నా, టీచర్ పాత్రలో శ్రీ లీల నటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. షూట్ నుంచి లీకైన కొన్ని ఫోటోలు, వీడియోలు కూడా అదే నిర్ధారణ చేస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ ఇప్పటికే ఈ లీక్స్ విషయంలో సీరియస్‌గా ఉంది. అయితే ఇప్పుడు కొత్తగా హీరోయిన్ రంగంలోకి దిగడంతో తేరి కథతోనే సినిమా చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Exit mobile version