ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రధారులుగా శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన సినిమా ‘కుబేర’. ఇప్పటికే విడుదలైన కుబేర ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్ హై ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మిస్తున్నారు. కుబేర తెలుగు, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని ‘పీ పీ డుమ్ డుమ్’ పాటని ముంబయిలో గ్రాండ్ గా లాంచ్ చేశారు.
Also Read:Trivikram: పాపం.. కన్ఫ్యూజన్లో త్రివిక్రమ్!
సాంగ్ లాంచ్ ఈవెంట్ లో హీరో ధనుష్ తమిళంలో మాట్లాడి షాక్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ… అందరికి నమస్కారం. కుబేర చాలా స్పెషల్ ఫిలిం. చాలా డిఫరెంట్ ఫిలిం. నా మనసుకు చాలా దగ్గరైన సినిమా. ఈ సినిమా షూటింగ్ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. నాగార్జున గారితో కలసి వర్క్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. చాలా పాజిటివ్ టీం తో కలిసి పని చేసాం. ఈ సినిమాలో బెగ్గర్ క్యారెక్టర్ ని ప్లే చేశాను. ఈ పాత్ర కోసం ఎంతో రీసెర్చ్, హోమ్ వర్క్ చేశా’ అని చెప్పను (నవ్వుతూ). మా డైరెక్టర్ గారిని ఫాలో అయ్యాను. శేఖర్ గారు బ్రిలియంట్ డైరెక్టర్.
Also Read:Balakrishna : నన్ను చూసుకునే నాకు పొగరు.. బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్
ఇలాంటి క్యారెక్టర్ ని నేను ఇప్పటివరకు చేయలేదు. డైరెక్టర్ శేఖర్ గారు వెరీ ప్యూర్ పర్సన్. ఆయన కారణంగానే ఈ సినిమా చేశాను. ఆయన 20 నిమిషాలు ఈ కథ చెప్పారు. ఆయన ఎనర్జీ నాకు చాలా నచ్చింది. వెంటనే ఓకే చేశాను. చాలా హానెస్ట్ గా తీసిన సినిమా ఇది. ఈ సినిమా నా బాల్యాన్ని గుర్తుకు తెచ్చింది. ఓ డంప్‌యార్డ్‌లో దాదాపు 7 గంటలపాటు నేను, రష్మిక షూటింగ్‌లో పాల్గొన్నాం. అక్కడ అంతసేపు ఉన్నా ఆమె బాగానే ఉంది. ‘నాకేం వాసన రావట్లేదు’ అని చెప్పింది. మరి ఆమెకు ఏమైందో నాకు తెలియదు (నవ్వుతూ). ఇలా ఎన్నో మంచి జ్ఞాపకాలు పంచిందీ కుబేర. జూన్ 20న ఈ సినిమాని చూడండి. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది’అన్నారు.