Upasana : ఢిల్లీలో ఉపాసన కొణిదెల బతుకమ్మ వేడుకలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ తెలుగు స్టూడెంట్స్ అసోసియేషన్ (TSA) ఆధ్వర్యంలో రామ జస్ కాలేజీ గ్రౌండ్స్, ఢిల్లీ యూనివర్సిటీలో బతుకమ్మ 2025 ఘనంగా నిర్వహించారు. దాదాపు నాలుగు వేల మందికి పైగా తెలుగు విద్యార్థులు, కుటుంబాలు ఉత్సాహంగా పాల్గొని తెలంగాణ ఆభరణమైన ఈ పూల పండుగను ఘనంగా జరుపుకున్నారు. దసరా పండుగ సందడితో ఈ వేడుక దిల్లీలో సాంస్కృతి, ఆనందం, రంగులతో కళకళలాడింది.
Also Read :కాంతార చాప్టర్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జూనియర్ ఎన్టీఆర్ పవర్‌ఫుల్ స్పీచ్
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
ఈ వేడుకకు ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖా గుప్తా హాజరై, బతుకమ్మ పూజలో పాల్గొని తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించారు. ఎంట్రప్రెన్యూర్, ఫిలాంత్రఫిస్ట్ శ్రీమతి ఉపాసన కామినేని కొణిదెల ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేఖా గుప్తాతో వేదిక పంచుకున్న ఉపాసన కొణిదెల దీపప్రజ్వలన చేసి, ప్రసంగం చేశారు. “బతుకమ్మ పూల పండుగ మాత్రమే కాదు ఇది మహిళా శక్తి, సమాజ బలం, సృజనాత్మకతకు ప్రతీక. దసరా స్ఫూర్తికి అనుసంధానమై ఉత్సాహం, ఆనందం, విజయోత్సవం. ఢిల్లీలో యువత ఈ సంప్రదాయాన్ని ఇంత గర్వంగా కొనసాగిస్తుండటం చూడడం గర్వకారణం. అలాగే, తెలంగాణ సంస్కృతిని అంతటా వ్యాప్తి చేసి, గౌరవంగా ఆచరించినందుకు ముఖ్యమంత్రి రేఖా గుప్తా గారికి ఉపాసన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Also Read :Jr NTR: ఇలాంటి సినిమా చేయడం అసాధ్యం, రిషబ్ వల్లే సాధ్యమైంది!
ముఖ్య అతిథిగా ఉపాసన కొణిదెలకు తెలంగాణ సాంప్రదాయాన్ని ప్రతిబింబించే శాలువా, జ్ఞాపికలు అందజేసి సత్కరించారు. ఆమె హాజరుతో 4,000 పైగా విద్యార్థులు, సందర్శకులు తెలుగు సంస్కృతి ఢిల్లీలో ఇంత విస్తృతంగా ప్రతిధ్వనించడం చూసి ఆనందించారు.
TSA అధ్యక్షుడు వివేక్ రెడ్డి, సలహాదారు కార్తీక్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో సంప్రదాయ పూజ, బతుకమ్మ నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఉత్సవ వైభవాన్ని మరింత పెంచాయి. దసరా పండుగ సమయంతో కలసి ఈ బతుకమ్మ వేడుక సంప్రదాయం, ఐక్యత, సాంస్కృతిని ప్రతిబింబిస్తూ, ఢిల్లీలోని తెలుగు విద్యార్థుల ఐక్యమత్యాన్ని TSA మరోసారి బలోపేతం చేసింది.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!