యంగ్ హీరో నితిన్ వరుస ప్లాపులతో తన మార్కెట్ తానే తగ్గించుకున్నాడు. 2016 నుండి 2025 వరకు 11 సినిమాలు చేసాడు నితిన్. వాటిలో భీష్మ మాత్రమే హిట్. మాచర్ల నియోజక వర్గం, ఎక్సట్రార్డనరీ మెన్ భారీ డిజాస్టర్స్. రాబిన్ హుడ్ నితిన్ కెరీర్ లో భారీ నష్టాలు తెచ్చిన సినిమాగా నిలిచింది. తమ్ముడు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత తక్కువ. ఈ సినిమా తన కెరీర్ కు బ్రేక్ ఇస్తుంది అనుకుంటే బయ్యర్స్ కి షాక్ ఇచ్చింది. ఆ సినిమా ప్లాప్ కారణంగా నెక్ట్స్ వేణు డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మించాల్సిన సినిమాను అలా పక్కన పెట్టేసారు.
Also Read : Bollywood : పుత్రోత్సాహంతో పులకించిపోయేందుకు స్వయంగా రంగంలోకి దిగిన బాద్ షా
ఈ సంగతి కాసేపు అలా ఉంచితే ప్రస్తుతం గ్యాప్ తీసుకున్న నితిన్ పలు కథలు వింటున్నాడు. ఈ నేపథ్యంలో స్టార్ డైరెక్టర్ కథకు కూడా ఓకే చేసాడు. దూకుడు, బాద్ షా, రెడీ వంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన శ్రీనువైట్ల ఆగడుతో తన ప్లాప్ ల పరంపరను ఇంకా ఆపలేదు. ఆయన చివరి చిత్రం అయిన గోపీచంద్ తో చేసిన విశ్వం కాస్త పర్లేదు అనే టాక్ తెచ్చుకుంది. ఇక తాజాగా యంగ్ హీరో నితిన్ కోసం శ్రీనువైట్ల ఓ కథను రెడీ చేసాడట. ఇటీవల నితిన్ ను కలిసి కథ వినిపించగా అందుకు నితిన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఈ సినిమాను టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ నిర్మిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబందించి అధికారక ప్రకటన కూడా రాబోతోంది. డిజాస్టర్స్ ఇస్తున్న డైరెక్టర్ తో అల్ట్రా డిజాస్టర్స్ కొడుతున్న హీరో కలిసి ఎలాంటి సినిమా చేస్తారో. ఈ సినిమాతో అయిన ఈ ఇద్దరు హిట్ కొడితే ‘ అబ్బా సాయిరాం’ అని హ్యాపీ ఫీల్ అవుతారు ఆడియెన్స్.