Two trade analysts receive legal notices by ‘Kalki 2898 AD’ team: ప్రభాస్ హీరోగా అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే ప్రధాన పాత్రల్లో నటించిన కల్కి 2898 AD చిత్రం జూన్ 27న థియేటర్లలోకి వచ్చింది. మొదటి రోజు నుండి ఇప్పటి వరకు ఈ స్పీమా టిక్కెట్లు ఫుల్ స్వింగ్‌లో అమ్ముడవుతున్నాయి. బాక్సాఫీస్ కలెక్షన్స్ కూడా బాగున్నాయి. ఈ సినిమాకి ఇప్పటికీ ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే తాజాగా కల్కి 2898 AD నిర్మాతలు బాలీవుడ్ ఫిల్మ్ ట్రేడ్ విశ్లేషకులు సుమిత్ కాడెల్, రోహిత్ జైస్వాల్‌లకు లీగల్ నోటీసు జారీ చేశారు. వీరు ఇద్దరూ సినిమాకు సంబంధించిన ఫేక్ బాక్సాఫీస్ నంబర్లను సర్క్యులేట్ చేశారనే ఆరోపణలున్నాయి.
T Series: స్టార్ ప్రొడ్యూసర్ ఇంట తీవ్ర విషాదం
నివేదిక ప్రకారం, సుమిత్ ఇప్పటికే నోటీసు అందుకోగా, రోహిత్ జూలై 20 శనివారం నాటికి నోటీసు అందుకోవచ్చని భావిస్తున్నారు. కల్కి 2898 AD నిర్మాతలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు కలెక్షన్స్ విడుదల చేస్తున్నారని ఈ ఇద్దరు ట్రేడ్ అనలిస్టులు తమ సోషల్ మీడియా ఖాతాలలో ఆరోపించారు. నిర్మాతలు వీరిద్దరి దగ్గరనున్న బాక్సాఫీస్ నంబర్ల వివరాలు అడిగారు. అలాగే నిర్ణీత గడువులోగా వారు చేయని పక్షంలో ఇద్దరిపై రూ.25 కోట్ల జరిమానా చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 2898 AD చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. 700 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రభాస్‌తో పాటు దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ ముఖ్య పాత్రల్లో నటించారు. ఇప్పటికే 1000 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా 1100 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది.