వరుసగా ప్రాజెక్టులకు కమిటౌతూ ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ నింపుతున్నారు జూనియర్ ఎన్టీఆర్ అండ్ ప్రభాస్. డార్లింగ్ లైనప్ అయితే వేరే లెవల్. కన్నప్పలో క్యామియో రోల్ చేసి మస్త్ ట్రీటిచ్చిన ప్రభాస్ నుండి ఈ ఏడాది ఎండింగ్లో రాజా సాబ్ రాబోతుంది. ప్రజెంట్ ఫౌజీ షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు డార్లింగ్. ఇక సందీప్ రెడ్డి వంగా డీల్ చేస్తోన్న స్పిరిట్ సెప్టెంబర్ నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. ఇవే కాకుండా కల్కి2, సలార్2తో పాటు మరో త్రీ ఫిల్మ్ లైన్లో పెట్టినట్లు టాక్.
Also Read : KOTA : ‘కోట’ మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు మాట
అటు తారక్ కూడా స్పీడ్ పెంచాడు. వార్ 2 కంప్లీట్ చేసిన జూనియర్ ఎన్టీఆర్. ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దేవర తర్వాత మ్యాన్ ఆఫ్ ది మాసెస్ నుండి రాబోతున్న ఫిల్మ్ ఇదే. ఈ సినిమాతో బాలీవుడ్ తెరంగేట్రం చేయబోతున్నాడు నందమూరి వారసుడు. మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న హై ఆక్టేన్ మూవీకి వర్క్ చేస్తున్నాడు తారక్. అలాగే త్రివిక్రమ్‌తో మైథాలజీ రిలెటెడ్ ఫిల్మ్, నెల్సన్ దిలీప్ కుమార్- నాగవంశీ ప్రాజెక్టుకు తారక్ ఫిక్స్ అయ్యాడన్నది బజ్. నెక్ట్స్ ప్రాజెక్టుల విషయంలో డార్లింగ్ అండ్ తారక్ ఫుల్ కాన్సట్రేషన్ చేయడమే కాదూ ఫిజిక్ విషయంలోనూ ఫుల్ ఫిట్ నెస్ మెయిన్ టైన్ చేస్తున్నారు. వార్ 2 కోసం తగ్గిన జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా కోసం సుమారు 14 కేజీల తగ్గాడని టాక్. అలాగే బాహుబలి, సాహో చిత్రాల తర్వాత భారీ వెయిట్ పెరిగి మొకాళ్ల నొప్పులతో బాధపడ్డ ప్రభాస్ కూడా మళ్లీ ఓల్డ్ లుక్కులోకి మారిపోయాడు. కాదూ కాదూ స్పిరిట్ కోసం మేకోవర్ అయ్యాడు డార్లింగ్. ఈ సినిమా కోసమే ఫిట్‌గా మారాడని తెలుస్తోంది. రీసెంట్లీ బాహుబలి 10 ఇయర్స్ రీ యూనియన్ ఈవెంట్లో కటౌట్ లుక్స్ చూసి ఫుల్ హ్యాపీలో ఉన్నారు ఫ్యాన్స్. డార్లింగ్ ఈజ్ బ్యాక్ అంటూ సంబరపడిపోతున్నారు. మొత్తానికి వెయిట్ లాస్ అవుతూ మరింత ఫిట్‌గా, వింటేజ్ లుక్కులోకి మారిపోతున్నారు హీరోలు.