ఓ మూవీకి స్పెషల్ అట్రాక్షన్ కింద స్టార్ బ్యూటీలతో స్పెషల్ సాంగ్స్ చేయించడం ఇప్పుడొక ట్రెండ్. గతంతో పోలిస్తే ఐటమ్ సాంగ్స్‌తో పాపులారిటీ వస్తుండటంతో హీరోయిన్లు కూడా సై అంటున్నారు. ఖర్చుకు వెనకాడకుండా మేకర్స్ కూడా సాంగ్స్ చేయిస్తారు. చివరకు ఆ పాటలు సినిమాలో కనిపించకుండా పోతే అటు నిర్మాతలకు, ఇటు హీరోయిన్లకు నష్టమే. సినిమా హిట్ కొడితే మేకర్లకు వచ్చే లాస్ ఉండదు కానీ హీరోయిన్లకు క్రెడిట్ దక్కకపోతే అదే అయ్యింది నిధి అగర్వాల్, నేహా శెట్టి విషయంలో. మొన్న మిరాయ్ నుండి నిధి సాంగ్ ఎత్తేస్తే ఇప్పుడు ఓజీ నుండి రాధిక అలియాస్ నేహా శెట్టి సాంగ్ మాయం చేశారు.
Also Read : Naveen Polishetty : నవీన్ పొలిశెట్టి సంక్రాంతికి తగ్గేదిలేదు.. ‘అనగనగా ఒక రాజు’ ప్రోమో రిలీజ్
మిరాయ్‌లో నిధి అగర్వాల్‌తో పెప్ సాంగ్ చేయించాడు కార్తీక్ ఘట్టమనేని. కానీ థియేటర్లలోకి వచ్చేసరికి నిధి సాంగే కాదు వైబ్ సాంగ్ కూడా ఎత్తేశారు. అదేమంటే ఫ్లో మిస్ అవుతుందని కవరింగ్ ఇచ్చారు. రీసెంట్లీ వైబ్ సాంగ్ యాడ్ చేసినా మిరాయ్ టీం నిధికి థాంక్స్ కార్డ్‌తో సరిపెట్టేశారు. అసలే హరి హర వీరమల్లు ఫెయిల్యూర్‌తో డీలా పడిపోయిన ఇస్మార్ట్ బ్యూటీకి ఈ పాటతోనైనా కెరీర్ గ్రాఫ్ పెరుగుతుందనుకుంటే మిస్ ఫైర్ అయ్యింది. నిధి అగర్వాల్ తరహాలోనే అన్యాయానికి గురైంది నేహా శెట్టి. ఓజీలో ఓ పెప్ సాంగ్‌కు ఆడిపాడింది. కోట్లు ఖర్చుపెట్టి బ్యాంకాక్‌లో షూట్ చేశారట. స్పెషల్ సాంగ్ గురించి ఓ ప్రైవేట్ ఈవెంట్లో నేహా ప్రస్తావించింది కూడా. కానీ స్క్రీన్ మీద ఆమె సాంగ్ కనిపించలేదు. టీమ్ కూడా మేం ఎనౌన్స్ చేయలేదు కదా అంటూ చెప్పుకొస్తుంది. ప్రజెంట్ పెద్దగా ఛాన్సులు లేని నిధి, నేహాలకు ఈ స్పెషల్ సాంగ్స్ అత్యంత కీలకమే. కానీ వీళ్లు ఒకటి అనుకుంటే మరోటి డిసైడ్ చేశారు మేకర్స్.