వడత్య హరీష్ దర్శకత్వంలో మహ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మించిన చిత్రం ‘తెలంగాణ దేవుడు’. ఉద్యమనాయకుడి పాత్రలో శ్రీకాంత్ నటించిన ఈ సినిమాతో జిషాన్ ఉస్మాన్ హీరోగా పరిచయం అవుతున్నాడు. త్వరలోనే థియేటర్లలోకి రానున్న సందర్భంగా పలువురు రాజకీయ, సినీ ప్రముఖుల కోసం ప్రీమియర్ ను నిర్మాత వేశారు.
Read Also : కాపీ రైట్స్ వివాదంలో కంగనా మూవీ…!
షో అనంతరం తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ ‘’తెలంగాణ దేవుడు’ సినిమా చూశాను. చాలా బాగుంది. సినిమాలో మంచి పాత్రలున్నాయ్. అందరి నటనా నాకు బాగా నచ్చింది. తెలంగాణ ఉద్యమం గురించి, ఆ సమయంలో ఎవరెవరు ఎలా కష్టపడ్డారనే విషయాలను చాలా చక్కగా చూపించారు. ఉద్యమ సన్నివేశాలు బాగా నచ్చాయి. సినిమాను తెరకెక్కించిన, నిర్మించిన అందరికీ పేరుపేరునా శుభాకాంక్షలు’ అని తెలిపారు.
కాగా 1969 నుండి 2014 వరకు తెలంగాణ ప్రాంతంలోని పరిస్థితులను చూసి చలించి ఉద్యమాన్ని ముందుకు నడిపించి ప్రజల కష్టాలను తీర్చిన ఒక మహానీయుని జీవితాన్ని చాలా చక్కగా తెరకెక్కించారని రాజకీయ నేతలు చిత్రబృందాన్ని అభినందించారు.