‘గుంటూరు కారం’ సినిమా తర్వాత త్రివిక్రమ్ ఎవరితో సినిమా చేస్తాడు అనే విషయం మీద చాలా చర్చలు జరిగాయి. మొదట ఈ మాటల మాంత్రికుడు అల్లు అర్జున్‌కి కథ చెప్పాడు, దాదాపుగా అది ఫిక్స్ అయిపోయింది అనుకున్న తరుణంలో, అల్లు అర్జున్‌కి, కథ నచ్చకపోవడంతో ఆయన అట్లీతో సినిమా చేసేందుకు వెళ్లారు. ఇప్పుడు త్రివిక్రమ్ ఇతర హీరోలతో సినిమాలు చేసేందుకు ప్లానింగ్ చేసి, చివరికి వెంకటేష్ హీరోగా ఒక సినిమా ఫైనల్ చేశారు. ఇందులో హిరోయిన్‌గా రుక్మిని వసంత్ ని కూడా ఫిక్స్ చేశాడు. అయితే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన మరో షాకింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.
Also Read : ‘Thug Life’ : కమల్ హాసన్ మాటలు.. నా తండ్రి రాజ్‌కుమార్‌ని గుర్తుచేశాయి
ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం రామ్ చరణ్‌ను సంప్రదించగా, ఆ పాత్రలో నటించేందుకు చరణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక త్వరలోనే ఆ సినిమా పట్టాలెక్కనున్నది. ఇక ఇప్పుడు మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాని ప్రకారం రామ్ చరణ్ తర్వాత సినిమా కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్‌తోనే ఉండబోతోంది. ప్రస్తుతానికి రామ్ చరణ్ 16వ సినిమాగా ‘పెద్ది’ రూపొందుతోంది. ఈ సినిమా పూర్తియిన వెంటనే ఆయన వెంకటేష్ సినిమాలో నటించబోతున్నాడు. ఆ సినిమా పూర్తి అయిన వెంటనే త్రివిక్రమ్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో ఒక మంచి పాన్ ఇండియా సబ్జెక్ట్ రూపొందిస్తున్నారని తెలుస్తోంది. ఆ రకంగా రామ్ చరణ్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ గురూజీ తోనే చేయబోతున్నాడు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇప్పటివరకు త్రివిక్రమ్ ఏ సినిమా చేసినా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ లేదా హారిక హాసినితోనే చేసేవాడు. కానీ ఇప్పుడు రామ్ చరణ్‌తో చేయబోయే సినిమాకి కొత్త బ్యానర్ ఒకటి రంగంలోకి దిగబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే త్రివిక్రమ్ రెమ్యూనరేషన్ తీసుకోకుండా, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో పాటు.. హారిక హాసిని బ్యానర్‌లను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తాడా? లేక కేవలం రెమ్యూనరేషన్ తీసుకుని వేరే బ్యానర్‌కి సినిమా చేస్తాడా? అనేది తెలియాల్సి ఉంది.