ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ‘రియల్‌మీ’ ఈ సంవత్సరం తన మొదటి లాంచ్ ఈవెంట్‌ను ఈరోజు (జనవరి 6) నిర్వహిస్తోంది. ఈ ఈవెంట్‌లో కంపెనీ రియల్‌మీ 16 ప్రో సిరీస్ సహా రియల్‌మీ బడ్స్ ఎయిర్ 8, రియల్‌మీ ప్యాడ్ 3తో సహా అనేక ఉత్పత్తులను పరిచయం చేస్తుంది. లాంచ్ ఈవెంట్ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. రియల్‌మీ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో లైవ్ స్ట్రీమింగ్ ప్రసారం కానుంది.
ఇటీవలి రోజుల్లో అత్యంత చర్చనీయాంశమైన ‘రియల్‌మీ 16 ప్రో’ సిరీస్ నేడు లంచ్ కానుంది. ఈ సిరీస్‌లో రెండు స్మార్ట్‌ఫోన్‌లు రియల్‌మీ 16 ప్రో, రియల్‌మీ 16 ప్రో ప్లస్ రిలీజ్ కానున్నాయి. రియల్‌మీ 16 ప్రో+లో కంపెనీ ప్రత్యేకంగా మొబైల్ ఫోటోగ్రఫీపై దృష్టి సారించింది. శామ్‌సంగ్ HP5 సెన్సార్‌తో నడిచే 200-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో రానుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) కు కూడా మద్దతు ఇస్తుంది. అదనంగా 50MP టెలిఫోటో పోర్ట్రెయిట్ కెమెరాను కూడా కలిగి ఉండనుంది. ఇది మెరుగైన జూమ్, క్లియర్ పోర్ట్రెయిట్ ఫోటోలను తీస్తుంది.
Also Read: OnePlus 13 Price Drop: 10 వేలకే ‘వన్‌ప్లస్ 13’.. ఇలాంటి అవకాశం మళ్లీమళ్లీ రాదు బాసూ!
రియల్‌మీ 16 ప్రో కూడా శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్ ఎంపికగా లాంచ్ కానుంది. ఇది 200MP కెమెరాతో పాటు అల్ట్రా-వైడ్ కెమెరా, అధికనాణ్యత గల ఫ్రంట్ కెమెరాతో రానుంది. రెండు ఫోన్‌లలో 4K HDR వీడియో రికార్డింగ్, ఫోకస్ ట్రాకింగ్ వంటి ఫీచర్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. డిజైన్ వారీగా రెండు ఫోన్‌లు స్లిమ్ బాడీ, ఫ్లాట్ డిస్‌ప్లే, సహజమైన టెక్స్చర్డ్ ఫినిషింగ్‌ను కలిగి ఉంటాయి. ప్రో మోడల్ IP69 రేటింగ్‌తో రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్లు 7000mAh బ్యాటరీతో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. త్వరలో ఫుల్ డీటెయిల్స్ తెలియరానున్నాయి. రియల్‌మీ ఈ ఈవెంట్లో స్మార్ట్‌ఫోన్, ఆడియో, టాబ్లెట్.. మూడు విభాగాలలో బలమైన పట్టును సాధించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.