ఈద్-అల్-ఫితర్ ను సాధారణంగా ఈద్ అని పిలుస్తారు. ఈ పండుగ రోజును దేశంలోని ముస్లిం సోదరులు సెలెబ్రేట్ చేసుకుంటారు. ఈ శుభ దినం ఇస్లామిక్ నెల షావ్వాల్ ఇరవై తొమ్మిదవ లేదా ముప్పయ్యవ రోజున పాటిస్తారు. రంజాన్ నెల మొత్తం ఉపవాసం చేసి, పవిత్ర మాసం చివరి రోజున రంజాన్ పండుగను జరుపుకుంటారు. దీనిని ఈద్ అని పిలుస్తారు. టాలీవుడ్ ప్రముఖులు ఈద్ సందర్భంగా ముస్లిం సోదరులకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి, మోహన్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, నందమూరి కళ్యాణ్ రామ్, హన్సికతో పాటు పలువురు ప్రముఖులు ఈద్ శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ పండుగ రోజున ప్రజలు సాధారణంగా మసీదులను సందర్శిస్తారు. ప్రార్థనలు చేయడంతో పాటు బహుమతులు ఇచ్చుకోవడం చేస్తుంటారు. ఈ సందర్భంగా తయారు చేసిన అనేక రకాల రుచికరమైన ఆహారాన్ని తింటారు. ఈ విందుకు స్నేహితులను, బంధువులను ఆహ్వానిస్తారు. రంజాన్ స్పెషల్ గా ఆ నెల రోజుల పాటు స్పెషల్ గా దొరుకుతుంది. ఈ సంవత్సరం కరోనా మహమ్మారి వల్ల లాక్ డౌన్ విధించడంతో ఈద్ సందర్భంగా జరిగే సామూహిక పార్థనలు జరగట్లేదు.