Senior Stars : బాలీవుడ్ భామలతో చిందేయాల్సిందే అంటున్న సీనియర్ హీరోలు

Senior Heros Songs

Senior Heros Songs

‘ఆదర్శ కుటుంబం’ అని ఫ్యామిలీ టైటిల్ పెట్టినా, ఇందులో ఐటెం సాంగ్‌కు స్పేస్ లేకపోయినా గురూజీ తీసుకున్నాడు. హీరోయిన్‌గా, ఐటెం గర్ల్‌గా ఫేడ్ అవుట్ అయిన డింపుల్ హయాతికి ఐటెం సాంగ్ ఛాన్స్ ఇచ్చి ఆదుకున్నాడు. సినిమాలో ఐటెం సాంగ్ ఉంటే మన సీనియర్ స్టార్స్ హిందీ బోల్డ్ బ్యూటీస్‌నే రికమెండ్ చేస్తున్నారు. ఆల్రెడీ చిరంజీవి ఓ బాలీవుడ్ బ్యూటీతో ఆడిపాడగా, బాలయ్య కూడా బాలీవుడ్ ఐటెం గర్లే కావాలంటున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న ‘దాదా’లో అదిరిపోయే ఐటెం సాంగ్ ఉందని తెలిసింది. డైరెక్టర్ బాలయ్యతో తీసిన తొలి చిత్రం ‘వీరసింహారెడ్డి’లో “మా బావ మనోభావాలు” అంటూ ఐటెం సాంగ్ పెట్టాడు. ‘దాదా’ కోసం బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ పేరు వినిపిస్తోంది. మన సీనియర్స్ చిరంజీవి, బాలకృష్ణ బాలీవుడ్ భామలతో ఆడిపాడుతున్నారు. ‘విశ్వంభర’లో చిరు, మౌనీ రాయ్‌పై ఐటెం సాంగ్ చిత్రీకరించారు. 39 ఏళ్ల బాలీవుడ్ బ్యూటీ ‘కిస్సిక్’ అంటూ ‘విశ్వంభర’లో మెరిసింది.

క్రేజీ హీరోయిన్ లేదంటే యంగ్ బ్యూటీని తీసుకుంటారు అనుకుంటే, ఎవ్వరూ ఊహించని విధంగా బాలీవుడ్ బ్యూటీకి ఛాన్స్ ఇచ్చాడు మెగాస్టార్. బాలీవుడ్ బోల్డ్ బ్యూటీస్‌తో ఆడిపాడడం చిరంజీవికి కొత్తేమీ కాదు. ‘వాల్తేరు వీరయ్య’లో ఊర్వశీ రౌతేలాతో కలిసి పార్టీ చేసుకున్నాడు. ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’లో గౌహర్ ఖాన్‌తో, ‘శంకర్ దాదా జిందాబాద్’లో యానా గుప్తాతో కలిసి చిందులేసిన మెగాస్టార్, మౌనీ రాయ్‌తో కలిసి ఎలాంటి హుక్ స్టెప్‌తో వస్తాడో చూడాలి మరి. ముందుగా వస్తున్న కాకా ఐటెం సాంగ్‌తో వస్తాడో లేదో చూడాలి మరి. ఇక సీనియర్ హీరో నాగార్జున మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాడు. తోటి సీనియర్స్‌లా నాగ్‌కు ఒకరితో ఆడే అలవాటు లేదు. స్పెషల్ సాంగ్ అంటే ముగ్గురు నలుగురు ఐటెం పాపలు ఉండాల్సిందే. ‘హలో బ్రదర్’, ‘కింగ్’, ‘బంగార్రాజు’లా 100వ సినిమా అయిన ‘కింగ్ 100’లో ఎంతమందితో రొమాన్స్ చేస్తాడో చూడాలి మరి.