Site icon NTV Telugu

Tollywood : నెక్ట్స్ హవా అంతా కొత్త పాపలదే!

Mamitha Baiju Kayadu Lohar

Mamitha Baiju Kayadu Lohar

అనుష్క, సమంత, రకుల్, శృతిలాంటి సీనియర్ భామలంతా సెటిల్డ్‌గా సినిమాలు చేస్తున్నారు. ఇక రష్మిక, సాయి పల్లవి, శ్రీ లీల, రాశీ ఖన్నా లాంటి రైజ్డ్ బ్యూటీస్ నార్త్ టు సౌత్ మాదే అంటున్నారు. మరీ టాలీవుడ్ నెక్స్ట్ క్వీన్స్ గా మారేదెవరు అంటే.. పెద్ద లిస్టే రెడీ అవుతోంది. ఒక్కరు కాదు డజన్ మందికి పైగా రైజింగ్ బ్యూటీలుగా మారుతున్నారు. వరుస ఆఫర్లు కొల్లగొడుతూ మాకు మేమే పోటీ.. మాకు లేదు సాటి అని ప్రూవ్ చేస్తున్నారు.

Also Read:Mirrors in Lifts: లిఫ్ట్ లో అద్దాలు ఎందుకు పెడతారో తెలుసా?.. వారి కోసమేనట!

ప్రేమలుతో ఓవర్ నైట్ క్రేజ్ బ్యూటీగా మారిన మమితా బైజు.. ప్రెజెంట్ సౌత్ స్టార్ హీరోలతో నటించే గోల్డెన్ ఛాన్స్ కొల్లగొట్టింది. విజయ్, సూర్య, ప్రదీప్ రంగనాథన్ లాంటి హీరోలతో వర్క్ చేస్తోంది ఈ మల్లూవుడ్ బ్యూటీ. డ్రాగన్ తో యూత్ గుండెల్ని గాయబ్ చేసిన కయాద్ లోహార్.. సౌత్ మొత్తం చుట్టేస్తోంది. తమిళ్, తెలుగు, మలయాళం సినిమాలతో యమ బిజీగా మారిపోయింది. కన్నప్పతో క్రష్ హీరోయిన్‌గా మారిన ప్రీతి ముకుందన్ ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో ఫుల్ స్వింగ్ మెయిన్ టైన్ చేస్తోంది.

Also Read:Sonusood : ఫిష్ వెంకట్ కుటుంబాన్ని కలిసిన సోనూసూద్

శాండిల్ వుడ్ నుండి ఊడిపడిన శ్రీనిధి శెట్టి, రుక్మిణీ వసంత్ ప్రెజెంట్ టాలీవుడ్ వాంటెడ్ హీరోయిన్స్. నీల్- తారక్ మూవీలో ఫీమేల్ లీడ్ గా నటించే గోల్డెన్ ఛాన్స్ కొల్లగొట్టేసింది రుక్కు. ఇక శ్రీనిధి హిట్3లో హిట్ కొట్టేసింది. ప్రెజెంట్ తెలుసు కదాలో నటిస్తోంది ఈ చందనపు బొమ్మ. మరోపక్క మహేష్ బాబు మరదలిగా రిజిస్టర్ అయిన మీనాక్షి చౌదరి.. లాస్ట్ ఇయర్ హడావుడి చేసింది కానీ.. రీసెంట్లీ సెలక్టివ్ సబ్జెక్టులతో దూసుకెళుతోంది. నాగ చైతన్య 24, అనగనగా ఒక రాజు చిత్రాల్లో నటిస్తోంది. ఇక నయా సెన్సేషన్ భాగ్యశ్రీ బోర్సే వరుస ఆఫర్లతో టాలీవుడ్‌లో రైజింగ్ బ్యూటీగా మారుతోంది. వీళ్లకు తోడు ఇవానా, కేతిక శర్మలాంటి భామలు కూడా ఈ జాబితాలో ఉన్నారు..ఇంత మంది భామల్లో ఎవరు టాప్ చైర్ లో నిలుస్తారో…? ఎవరు సౌత్ స్టార్ క్వీన్స్ గా మారతారో చూద్దాం.

Exit mobile version