గ్లాడియేటర్ సినిమా గురించి అందరికి తెలిసే ఉంటుంది.. ఈ సినిమా విడుదలైన మొదటి రోజే కలెక్షన్స్ సునామి సృష్టించింది.. బాక్సాఫీసు వద్ద ఒక ప్రభంజనాన్ని సృష్టించింది.. ఈ సినిమాకు సీక్వెల్ గా ఇప్పుడు మరో సినిమాను తెరకేక్కిస్తున్న విషయం తెలిసిందే.. గత కొన్ని రోజులుగా గ్లాడియేటర్ 2 సినిమా షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రపంచమంతా వెయిట్ చేస్తున్నారు.. భారీ బడ్జెట్ తో తెరకేక్కుతున్న ఈ సినిమా సెట్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు కూడా అయ్యినట్లు సమాచారం..
సెట్ లో భారీ యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తుండగా.. అగ్నిప్రమాదం జరిగిందని.. ఇందులో ఆరుగురు గాయపడగా.. వెంటనే అప్రమత్తమైన చిత్రయూనిట్ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుంది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదం లో ఎలాంటి ప్రాణాపాయం సంభవించలేదని మేకర్స్ ఈ విషయం పై ప్రకటన ఇవ్వడంతో జనాలు ఊపిరి పీల్చుకున్నారు…. ఇకపోతే సినిమాలో నటిస్తున్న మెయిన్ యాక్స్టర్స్ ఎలాంటి గాయాలు కాలేదని.. వారంతా సురక్షితంగా ఉన్నారని టీం తెలిపింది. కానీ అగ్నిప్రమాదంలో సెట్ పూర్తిగా కాలిపోవడం తో షూటింగ్ మరింత ఆలస్యం కానుంది.
ఇది ఇలా ఉండగా 2000 లో వచ్చిన ఈ హిస్టారికల్ డ్రామా చిత్రానికి దర్శకత్వం వహించిన సర్ రిడ్లీ స్కాట్ రెండవ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 2024లో విడుదల కానుంది. గతంలో వచ్చిన గ్లాడియేటర్ చిత్రం ఐదు ఆస్కార్‌లను గెలుచుకుంది.. ఇందులో రస్సెల్ క్రో ఉత్తమ నటుడి తో సహా రోమన్ జనరల్ మాక్సిమస్ డెసిమస్ మెరిడియస్‌తో పాటు జోక్విన్ ఫీనిక్స్ చక్రవర్తి నటించారు.. గ్లాడియేటర్ గా మారడానికి ముందు యుద్ధ హీరోగా మారడాన్ని చూపించారు.. ప్రస్తుతం ఈ ప్రమాదం వల్ల షూటింగ్ కొద్ది రోజులు ఆగిపోనుందని సమాచారం.. గతంలో భారీ బడ్జెట్ తో తెరకేకుతున్న సినిమా సెట్ లలో వరుసగా అగ్నిప్రమాదం జరుగుతున్న విషయం తెలిసిందే..