టాలీవుడ్ డైరెక్టర్ కేకే అలియాస్ కిరణ్ కుమార్ ఆకస్మికంగా మృతి చెందినట్లు తెలుస్తోంది. తెలుగులో మంచు మనోజ్ హీరోగా ‘కేడి’ అనే సినిమా చేసిన ఆయన, ఆ సినిమా తర్వాత దర్శకత్వానికి సుదీర్ఘమైన గ్యాప్ తీసుకున్నారు. అయితే, ఆయన లెజెండరీ దర్శకుడు మణిరత్నం దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేస్తూ వస్తున్నారు. మణిరత్నం తెరకెక్కించే చాలా సినిమాలకు ఆయన అసోసియేట్ డైరెక్టర్గా కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
Also Read :Hyper Aadi : అక్రమ సంబంధాలకు ఓకే.. పెళ్లికి నో? హైపర్ ఆది కామెంట్స్ వైరల్
ఈ మధ్యనే ఆయన దర్శకుడిగా మరో సినిమాను కూడా ప్రారంభించారు. శ్రీకాంత్ ఓదెల సోదరుడు శశి ఓదెల, దీక్షిత్ శెట్టి హీరోలుగా ‘కె.జె.క్యూ’ (కింగ్ జాకీ క్వీన్) అనే సినిమాను ఆయన డైరెక్ట్ చేస్తున్నారు. అయితే, ఆ సినిమా షూటింగ్ అంతా పూర్తయిపోయిన తర్వాత ఆయన కన్నుమూసినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు ఆయన కన్నుమూసినట్లు ‘కింగ్ జాకీ క్వీన్’ సినిమా టీం అధికారికంగా ప్రకటించింది.
Also Read :Vishwambhara : ఎట్టకేలకు ‘విశ్వంభర’ రిలీజ్ పై లేటెస్ట్ అప్డేట్ !
అయితే, ఆయన ఎలా మరణించారు అనే విషయం మీద ప్రస్తుతానికి అధికారికంగా ఇంకా ఎలాంటి సమాచారం లేదు. కేకే ఈ మధ్యనే నటుడిగా కూడా ఒక సినిమాలో కనిపించారు. విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘భద్రకాళి’. ఈ భద్రకాళి సినిమాలో కేకే ఒక సిబిఐ ఆఫీసర్ పాత్రలో కనిపించారు. నటుడిగా ఆయన మరిన్ని సినిమాల్లో కనిపిస్తారు అనుకుంటున్న సమయంలోనే, ఆయన ఆకస్మిక మరణం సినీ వర్గాల్లో తీవ్ర షాక్ కలిగిస్తోంది.