సీనియర్ హీరోయిన్ ప్రియాంక చోప్రా గురించి పరిచయం అక్కర్లుదు. ప్రజంట్ బాలీవుడ్, హాలివుడ్ విషయం పక్కన పెడితే.. ఈ అమ్మడు పేరు ఇలా హఠాత్తుగా టాలీవుడ్‌లో వినిపిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ముందు మహేష్ బాబు – రాజమౌళి ప్యాన్ వరల్డ్ మూవీలో ఛాన్స్ కొట్టేసింది. అందులో ఆమె హీరోయినా లేక ప్రాధాన్యం ఉన్న పాత్ర చేస్తోందా లాంటి క్లారిటీ ఇప్పటిదాకా రాలేదు. కానీ లీక్స్ అయితే మహేష్ జోడి కాదని అంటున్నాయి. దీని గురించి రాజమౌళి చెబితే తప్ప బయటకు రాదు. కానీ ‘SSMB29’ మూవీ కేరళ, హైదరాబాద్ షెడ్యూల్స్‌లో పాల్గొన్న ప్రియాంకా చోప్రా తనకు సంబంధించిన కీలక ఎపిసోడ్స్‌ని పూర్తి చేసుకుందట. ప్రస్తుతం చిన్న బ్రేక్ ఇచ్చారట. అయితే తాజాగా ప్రియాంక టాలీవుడ్‌లో మరో ఆఫర్ కొట్టినట్టుగా వార్తలు వినపడుతున్నాయి..
Also Read: N.T.R : యాక్టర్ అవుతానంటే నా బామ్మర్దికి సపోర్ట్ చేయనన్నాను
పుష్ప తో పాన్ వరల్డ్‌గా గుర్తింపు సంపాదించుకున్నాడు స్టార్ హీరో అల్లు అర్జున్. ప్రజంట్ ఆయన వరుస చిత్రాలు లైన్ లో పెట్టాడు.. ఇందులో దర్శకుడు అట్లీతో మూవీ కూడా ఒకటి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ కోసం ఇటీవల ప్రియాంక చోప్రా ని సంప్రదించారనే వార్త హాట్ టాపిక్‌గా మారింది. ఇందులో కూడా అల్లు అర్జున్‌తో ఆడిపాడేందుకా లేక ఇంకేదైనా క్యారెక్టర్ గురించి అడిగారా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే ఈ వార్త గాసిప్ స్టేజిలో ఉంది. అయినా సరే ఎప్పుడో ఫామ్ తగ్గిపోయిన ఈ క్రేజీ భామకు ఇలా తెలుగు దర్శకులు క్యూ కట్టడం ఆశ్చర్యకరం అనే చెప్పాలి. టాలీవుడ్‌లో ప్రియాంక ఇప్పటిదాకా నటించింది ఒక్క రామ్ చరణ్ తో ‘జంజీర్’ తెలుగు వర్షన్ లో ‘తుఫాన్’ మూవీలో మాత్రమే.