August Box Office: టాలీవుడ్లో హీట్ పెంచనున్న ఆగస్టు రిలీజ్లు.. నాని Vs రవితేజ Vs శర్వా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ బాక్సాఫీస్‌కు రాబోయే రోజులు అత్యంత కీలకంగా మారబోతున్నాయి. జూన్ మొదటి వారంలో (జూన్ 4న) గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమాకు గనుక పాజిటివ్ టాక్ వస్తే, జూన్ నెల మొత్తం బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ హవానే నడవడం ఖాయం. ఆ తర్వాత థియేట్రికల్ బిజినెస్‌ను మరింత ఊపులోకి తెచ్చేందుకు పలు క్రేజీ చిత్రాలు క్యూ కట్టబోతున్నాయి.
ఈ క్రమంలో ఈ ఏడాది ఆగస్టు (August) నెల బాక్సాఫీస్ లైనప్ ఇప్పుడే చాలా సాలిడ్‌గా కనిపిస్తోంది. ఇప్పటికే పలువురు స్టార్ హీరోల సినిమాలు ఆగస్టు స్లాట్లను బుక్ చేసుకోగా.. తాజాగా మాస్ మహారాజా రవితేజ సినిమా కూడా ఈ రేసులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఖరారైన డేట్ల ప్రకారం బాక్సాఫీస్ బరిలో ఉన్న సినిమాలో నేచురల్ స్టార్ నాని నటిస్తున్న మోస్ట్ ప్రొమిసింగ్ ఫిలిం ‘ది ప్యారడైజ్’ ఆగస్టు 21న గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైంది. తర్వాత టాలెంటెడ్ హీరో శర్వానంద్ నటిస్తున్న భారీ చిత్రం ‘భోగి’ ఆగస్టు చివరి వారంలో, అంటే ఆగస్టు 28న గ్రాండ్ రిలీజ్‌కు ప్లాన్ చేసుకుంది. ఇక గత కొన్ని చిత్రాలతో ఆశించిన విజయాలు అందుకోలేకపోయిన మాస్ మహారాజా రవితేజ.. ఈసారి ఒక వినూత్నమైన కథతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.
Also Read
- Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
- Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
- Ranabaali Teaser: రణబాలి టీజర్లో విజయ్ విశ్వరూపం.. బ్రిటిష్ కాలం నాటి చీకటి కథతో సినిమా!
- Tollywood Stars : ఆరోగ్యాన్ని పక్కన పెట్టి షూటింగ్స్‌కు పరుగులు ఎందుకు?
ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘ఇరుముడి’ (Irumudi) కూడా ఆగస్టు రేసులోనే నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో-ఫాంటసీ అడ్వెంచర్ ఫిలిం ‘విశ్వంభర’ కూడా ఆగస్టు రేసులోకి వచ్చే అవకాశం ఉందంటూ ఫిలిం నగర్ సర్కిల్స్‌లో కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా, జూన్‌లో ‘పెద్ది’తో మొదలయ్యే టాలీవుడ్ బాక్సాఫీస్ జాతర.. ఆగస్టు నాటికి నాని, శర్వానంద్, రవితేజ వంటి స్టార్ల చిత్రాలతో మరింత హీట్ ఎక్కడం ఖాయంగా కనిపిస్తోంది.
తాజావార్తలు
-
TVK-Congress Alliance: విజయ్ పొలిటికల్ అలయన్స్‌కు కొత్త పేరు.. కాంగ్రెస్, VCK, MDMK, IUMLతో కలిసి కొత్త రాజకీయ శక్తి
-
Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
-
BRICS Summit 2026: బ్రిక్స్ సమ్మిట్ 2026 షెడ్యూల్ విడుదల.. సభ్య దేశాలు, షెడ్యూల్, టైమింగ్స్ తెలుసుకోండి
-
Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!