టోక్యో ఒలంపిక్స్ భారత్ కు మరీ ఉత్సాహకరమైన ఫలితాలు తీసుకురావటం లేదు. అయితే, విశ్వ క్రీడల్లో ఎప్పుడైనా మన సంగతి అంతంత మాత్రమే. అయితే, ఈసారి మెడల్స్ సంఖ్య మాట ఎలా ఉన్నా కొన్ని క్రీడల్లో మన వాళ్లు సృష్టిస్తున్న సంచలనాలు జనాల్లో ఉద్వేగాన్ని, ఉత్సాహాన్ని నింపుతున్నాయి. మరీ ముఖ్యంగా, ఇండియన్ ఉమెన్స్ హాకీ టీమ్ అద్భుతాలు సృష్టిస్తోంది. సెమీ ఫైనల్ లోకి దూసుకెళ్లి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఏకంగా బంగారు పతకానికి దాదాపు దగ్గరగా వచ్చేసింది. అయితే, ఇంకా మెడల్ ఏదీ కన్ ఫర్మ్ కానప్పటికీ భారత మహిళా హాకీ చాంపియన్స్ పర్ఫామెన్స్ మాత్రం ఇప్పటికే భారతీయుల మదులు దోచేసింది.
Read Also : తిరుపతిలో జాన్వీ కపూర్ పెళ్లి! కాంచీవరం చీరకట్టుతో కళ్యాణ మండపంలోకి…
ఇండియన్ ఉమెన్ హాకీ టీమ్ ఆటతీరుతో ఉబ్బితబ్బిబైపోతోన్న వారిలో చిత్రాశీ రావత్ కూడా ఒకరు! ఈమె ఎవరు అంటారా? షారుఖ్ నటించిన ‘చక్ దే! ఇండియా’లో ఆమె కూడా నటించింది. హాకీ ప్లేయర్ కోమల్ చౌతాలా పాత్రలో అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చింది. అయితే, చిత్రాశీ తెర మీదే కాదు రియల్ గా కూడా హాకీ ప్లేయర్. అందుకే, ప్రస్తుత టోక్యో ఒలంపిక్స్ లో ఇండియన్ టీమ్ మ్యాచెస్ అన్నీ ఆసక్తిగా చూస్తోందట. మన లేడీ చాంపియన్స్ అదరగొడుతున్నారని మెచ్చుకున్న ఆమె ‘చక్ దే! ఇండియా’ సినిమాని గుర్తు చేసుకుంది. 2007లో ఆగస్ట్ నెలలో మూవీ రిలీజైంది. ఇప్పుడు ఒలంపిక్స్ కూడా సేమ్ మంత్ లో జరుగుతున్నాయి. ఆ కారణం చేతనే టోక్యోలో ఇండియన్ ఉమెన్ టీమ్ మ్యాచెస్ చూస్తున్నప్పుడల్లా ‘చక్ దే ఇండియా’ అప్రయత్నంగానే కళ్ల ముందు మెదులుతోందట!
కేవలం ‘చక్ దే ఇండియా’ ఫేమ్ చిత్రాశీ రావత్ మాత్రమే కాదు ప్రస్తుతం యావత్ భారతదేశం ఇండియన్ హాకీ క్రీడాకారిణులపై బోలెడు ఆశలు పెట్టుకుంది. మీరాభాయ్ చాను, మన పీవీ సింధూ వంటి వారు ఇప్పటికీ పతాకలు సాధించేశారు. హాకీలోనూ అమ్మాయిలు తమ గోల్స్ పవర్ తో పాటూ గాళ్ పవర్ చూపిస్తారని అందరూ నమ్ముతున్నారు!