యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన భారీ ముల్టీస్టారర్ వార్ 2. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్నాడు ఎన్టీఆర్. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లిమ్స్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తుండగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రం ఏడాది ఆగస్టు 14 న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.
Also Read : Filmfare Glamour And Style Awards South : ఫిలింఫేర్ అవార్డ్స్ విజేతలు వీరే..
రిలీజ్ కు కేవలం నాలుగు రోజులు మాత్రమే ఉంది. ఈ నేపధ్యంలో నేడు హైదరాబాద్ లోని యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. ఈ వేడుకకు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో పాటు యూనిట్ సభ్యులు హాజరుకానున్నారు. గతంలో ఎన్టీఆర్ నటించిన దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు జరిగిన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నేడు జరగబోయే వార్ 2 ఈవెంట్ కు పలు జాగ్రత్తలు తీసుకున్నారు. ఎంట్రీ కార్డ్ లేనిదే ఎట్టి పరిస్థితుల్లో లోనికి అనుమతించట్లేదు నిర్వాహకులు. నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రమోషన్స్ సరిగా చేయడం లేదని భావిస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు జోష్ నింపేందుకు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో సెన్సేషన్ క్రియేట్ చేయాలనీ తెలుగు హక్కులు దక్కించుకున్ననాగవంశీ భావిస్తున్నాడు. చాలా సంత్సరాలుగా ఎన్టీఆర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగలేదు. ఇప్పుడు ఆ ఆకలిని వార్ 2 తో తీర్చబోతున్నాడు ఎన్టీఆర్.