కాజల్, కియారా, సమంతని బీట్ చేసిన ‘భీష్మ’ బ్యూటీ!

కాజల్, సమంత, కియారా అద్వాణీ… ఎవ్వరైనా డోంట్ కేర్ అంటోంది రశ్మిక మందణ్ణా! ఇంతకీ, విషయం ఏంటి అంటారా? ‘సరిలేరు నీకెవ్వరు’ బ్యూటీ తనకు దక్షిణాదిలో సరి వచ్చే వారెవరూ లేరంటూ ఇన్ స్టాగ్రామ్ లో దూసుకుపోతోంది. ప్రస్తుతం రశ్మిక ఇన్ స్టా ఫాలోయర్స్ సంఖ్య, అక్షరాలా… 19.2 మిలియన్లు! అంటే, కోటి 92లక్షలు…

దాదాపు రెండుకోట్ల మంది అభిమానులతో రశ్మిక సౌత్ బ్యూటీస్ లో టాప్ స్టార్ గా మారిపోయింది. ఇంత కాలం కాజల్ అగర్వాల్ ఇన్ స్టాగ్రామ్ సౌత్ క్వీన్ గా కొనసాగేది. ఆమె ఫాలోయర్స్ 19 మిలియన్లు కాగా రశ్మిక లెటెస్ట్ గా ఆ మార్కుని క్రాస్ చేసేసింది. ఇక 17.7 మిలియన్లతో కియారా, 17.5 మిలియన్లతో సమంత కూడా రశ్మిక కంటే వెనుకబడిపోయారు. ట్విస్ట్ ఏంటంటే… మన ‘గీత గోవిందం’ గాళ్ విజయ్ దేవరకొండని కూడా బీట్ చేసేసింది! విజయ్ ఇన్ స్టాగ్రామ్ ఫాలోయర్స్ 12.5 మిలియన్లు మాత్రమే…

Read Also : షూటింగ్ స్పాట్ లో మాధవన్!

కర్ణాటక క్రష్ గా కన్నడ సినిమా రంగంలో దుమారం రేపిన రశ్మిక తెలుగులో, తమిళంలోనూ నటించింది. ప్రస్తుతం ముంబైలో మకాం వేసి వరుసగా బాలీవుడ్ చిత్రాలు చేస్తోంది. దాంతో బీ-టౌన్ మీడియా మన లేడీ ‘కామ్రేడ్’ని నేషనల్ క్రష్ అంటూ పాప్యులర్ చేస్తోంది. కొత్తగా వచ్చిన బాలీవుడ్ క్రేజ్ రశ్మిక ఇన్ స్టాగ్రామ్ హంగామాకి కారణంగా భావించవచ్చు! తన 19 మిలియన్ల ‘ఆన్ లైన్ ఫ్యామిలీ’కి బెంగుళూరు బ్యూటీ ‘బిగ్ థ్యాంక్స్’ చెప్పింది…

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-