Anil Ravipudi : నేటి నుండి వెంకీ – కళ్యాణ్ రామ్ – అనిల్ ఆట షురూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ హిట్ మెషీన్ అనిల్ రావిపూడి.. గత కొన్నాళ్లుగా ప్రతి సంక్రాంతికి ఓ సినిమా రిలీజ్ చేసేలా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. గతేడాది సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’, ఈ ఏడాది సంక్రాంతికి మెగాస్టార్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాతో ఇండస్ట్రీ హిట్స్ కొట్టాడు అనిల్. ఇక ఇప్పుడు వెంకటేష్, కళ్యాణ్ రామ్‌లతో క్రేజీ మల్టీస్టారర్ తెరకెక్కిస్తున్నాడు.
ఎంటర్టైన్మెంట్కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే అనిల్ రావిపూడి, ఈ చిత్రాన్ని అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్లాన్ చేశారు. ఇటీవలె లాంఛనంగా మొదలైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఒక సాంగ్‌తో పాటు కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. తాజా సమాచారం ప్రకారం కొత్త షెడ్యూల్ జులై 2 నుండి అనగా ఈ రోజు నుండి ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్లో విక్టరీ వెంకటేష్ సెట్స్‌లోకి అడుగుపెట్టబోతున్నారు. అనిల్ రావిపూడి ఈ సినిమాను ఎలాంటి బ్రేక్స్ లేకుండా నాన్‌స్టాప్‌గా షూట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. వచ్చే అక్టోబర్ నవంబర్ వరకు టోటల్ షూటింగ్‌ను పూర్తి చేయాలనేది ప్లాన్. అదే జోష్‌తో ఇప్పుడు షూటింగ్ చేస్తున్నాడు. ఈ సినిమాలో వెంకటేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తుండగా.. కళ్యాణ్ రామ్ జోడీగా కృతి శెట్టి నటిస్తోంది. ఈ క్రేజీ జోడీలతో వెండితెరపై అనిల్ చేసే మ్యాజిక్ మామూలుగా ఉండదని ఇన్సైడ్ టాక్. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నఈ సినిమా.. మ్యూజికల్ పరంగాను అదిరిపోతుందని అంటున్నారు. మరి అనిల్ రావిపూడి ఈసారి ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి.
Also Read
- Jana Nayagan : జననాయగన్ రిలీజ్‌కు అన్ని దారులు క్లియర్.. రిలీజ్ ఎప్పుడంటే?
- Kajal Aggarwal: కాజల్ కెరీర్లోనే మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. ఆ స్టార్ డైరెక్టర్‌తోనేనా?
- Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
- Ramayan Leak: రణబీర్ కపూర్ ‘రామాయణం’ లీక్? ఆ 11 సెకన్ల క్లిప్ చూసి తలబాదుకుంటున్న ఫ్యాన్స్!
తాజావార్తలు
-
Anil Ravipudi : నేటి నుండి వెంకీ – కళ్యాణ్ రామ్ – అనిల్ ఆట షురూ
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
Russian Couple: ప్రేమ కోసం ప్రాణాలనే పణంగా పెట్టిన జంట.. 1,454 అడుగుల ఎత్తులో ప్రపోజ్!
-
Tamil Nadu Politics: తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఏఐఏడీఎంకేకు షాక్.. విజయ్ పార్టీకి భారీ బూస్ట్..
-
Durefishan Saleem: పాక్ నటి డేటింగ్ రూమర్స్.. యూట్యూబర్‌తో పెళ్లి వార్తలపై మేకప్ ఆర్టిస్ట్ షాకింగ్ రియాక్షన్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!