హారర్ మూవీ లవర్స్ కు ‘కంజ్యూరింగ్ ’ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘కంజ్యూరింగ్ ’, ‘కంజ్యూరింగ్ 2’ సూపర్ హిట్ అవ్వటంతో అదే ఫ్రాంచైజీలో తెరకెక్కుతున్న ‘ది కంజ్యూరింగ్ : ద డెవిల్ మేడ్ మీ డూ ఇట్’ చిత్రం విడుదల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. దెయ్యాలు నిజమని నిరూపించిన నిజమైన కేసు ఆధారముగా ఈ చిత్రం తెరకెక్కినట్టు మేకర్స్ చెబుతున్నారు. 2021 జూన్ 4న ఒకేసారి థియేటర్స్ లోనూ, హెబ్ బీఓ మ్యాక్స్ ఓటీటీలోనూ జనానికి అందుబాటులోకి రానుంది ఈ సీక్వెల్. వెరా ఫార్మిగా, పాట్రిక్ విల్సన్ మైఖేల్ చావెస్ (“ది కర్స్ ఆఫ్ లా లోలోరోనా”) దర్శకత్వంలో లోరైన్, ఎడ్ వారెన్ పాత్రలో తిరిగి నటించారు. “ది కంజురింగ్: ది డెవిల్ మేడ్ మి డు ఇట్” ను జేమ్స్ వాన్, పీటర్ సఫ్రాన్ నిర్మించారు. వీరు అన్ని “కంజురింగ్” యూనివర్స్ చిత్రాలకు సహకరించారు. దీనిని వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ పంపిణీ చేస్తుంది. ఈ చిత్రం నుంచి ఫైనల్ ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. అనుభవజ్ఞులైన నిజ జీవిత పారానార్మల్ పరిశోధకులు ఎడ్, లోరైన్ వారెన్ల ఫైళ్ళ నుండి చాలా సంచలనాత్మక కేసులలో ఇది ఒకటి… అమెరికాను దిగ్భ్రాంతికి గురిచేసిన దెయ్యాల కేసు ఇది… ఒక చిన్న పిల్లవాడి ఆత్మ కోసం పోరాటం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అత్యంత్య భయంకరమైన ఈ ట్రైలర్ ను మీరు కూడా వీక్షించండి.