Kamalhasan : కమల్ కు షాక్ ఇచ్చిన ఆ స్టార్ డైరెక్టర్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశ్వనటుడు కమల్ హాసన్ చాలా కాలం తరువాత విక్రమ్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు.విక్రమ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.విక్రమ్ సినిమాతో కమల్ హాసన్ కు భారీగా లాభాలు వచ్చాయి.ప్రస్తుతం కమల్ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా వున్నారు.కమల్ హాసన్ నటించిన భారతీయుడు 2 విడుదలకు సిద్ధంగా వుంది .స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 13 విడుదల కానున్నట్లు సమాచారం.ఈ సినిమాతో పాటు కమల్ హాసన్ థగ్ లైఫ్ మరియు కల్కి 2898 AD లాంటి భారీ చిత్రాలలో నటిస్తున్నారు.ఇలాంటి సమయంలో లోకనాయకుడిపై నిర్మాతల మండలికి ఫిర్యాదు అందింది. ప్రముఖ నిర్మాతలు లింగుసామి మరియు సుభాష్ చంద్రబోస్ ఈ ఫిర్యాదు చేశారు. 2015లో ఉత్తమ విలన్ చిత్రం కోసం కమల్ హాసన్, లింగుసామి మరియు సుభాష్ కలిసి వర్క్ చేసారు.ఆ చిత్రాన్ని రమేష్ అరవింద్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.
అయితే ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో కమల్ వారితో మరో సినిమా చేయడానికి అంగీకరించినట్లు సమాచారం.30 కోట్ల బడ్జెట్‌తో మరో సినిమా చేసి గత సినిమా నష్టాన్ని భర్తీ చేస్తానని కమల్ హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.అయితే హామీ ఇచ్చినప్పటికీ కూడా కమల్ హాసన్ తొమ్మిదేళ్లుగా తమతో ఎలాంటి సినిమా చేయలేదని వారు ఆరోపించినట్టు సమాచారం. తాను ఉత్తమ విలన్ సినిమాకు దర్శకత్వం వహించి ఉంటే ఆ సినిమా రిజల్ట్ వేరేలా ఉండేదని.. కానీ నిర్మాతగా మారినందువల్లే ఈ నష్టాలను భరించాల్సి వస్తుందని లింగుస్వామి అన్నారు. ఈ నష్టాల గురించి అలాగే మరో కొత్త సినిమా నిర్మించడం విషయంలో చాలాసార్లు కమల్ హాసన్ ను కలిశామని.. కానీ మరో సినిమా చేసేందుకు ఆయన ముందుకు రావడం లేదని అన్నారు. దీంతో తప్పని పరిస్థితులలో కమల్ పై ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని లింగుసామి తెలిపారు.
Also Read
తాజావార్తలు
-
Donald Trump: మోడీ నాకు మంచి స్నేహితుడు.. భారత్‌తో త్వరలో వాణిజ్య ఒప్పందం..
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా ‘పెద్ది’?
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!