Thaman : ‘ఎల్లమ్మ’ కథపై తమన్ షాకింగ్ కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thaman : ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ‘ఎల్లమ్మ’ కథపై దేవిశ్రీ ప్రసాద్‌పై పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఎల్లమ్మ’ సినిమా గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ నటుడిగా మారుతున్న సంగతి తెలిసిందే. ఆయన నటిస్తున్న ‘ఎల్లమ్మ’ చిత్రంపై ఇండస్ట్రీలో మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమాపై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
‘ఎల్లమ్మ’ సినిమా కథ తనకు పూర్తిగా తెలుసని, కథ చాలా అద్భుతంగా ఉంటుందని తమన్ అన్నారు. ఈ సినిమా కోసం దేవిశ్రీ ప్రసాద్ చాలా కష్టపడుతున్నారని, ఆయన పడుతున్న శ్రమ కచ్చితంగా తెరపై కనిపిస్తుందని ప్రశంసించారు. ‘ఎల్లమ్మ’ చిత్రం దేవిశ్రీ ప్రసాద్ యాక్టింగ్ కెరీర్‌కు చాలా పెద్ద ప్లస్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్ట్ లో మరో విశేషం ఏమిటంటే, దేవిశ్రీ నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. దీనిపై ఆయన స్పందింస్తూ.. “ఈ సినిమాకి కొన్ని పాటలు చేయమని నన్ను అడిగారు. దానికి నేను కూడా తప్పకుండా చేస్తానని అన్నాను” అని తమన్ పేర్కొన్నారు. హాస్య నటుడిగా తన సినీ ప్రస్థానాన్ని స్టార్ట్ చేసి బలగం సినిమా సంచలన విజయం అందుకున్న వేణు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
Also Read
- Faria: నేనింకా ఇల్లు కొనలేదు.. సందీప్ కిషన్ చెప్పాక కొనాలనుకున్నా.!
- Hanuman Ansh : రూ. 400 కోట్ల దిశగా హనుమాన్ అంశ్ 47వ రోజు దాదాపు రూ. 5 కోట్లు వసూళ్లు
- Sanjay Leela Bhansali : రణబీర్ కపూర్ 'లవ్ అండ్ వార్' ఫస్ట్ లుక్ రిలీజ్
- Hashmi - Himesh : 20 ఏళ్ల తర్వాత ఇమ్రాన్ హష్మీ, హిమేష్ రేష్మియా రీ యూనియన్
తాజావార్తలు
-
Faria :దళపతి విజయ్ వారసుడు ‘ఫ్యూచర్ సీఎం’ .. సంజయ్‌పై నటి ఫరియా అబ్దుల్లా క్రేజీ కామెంట్స్!
-
Afghanistan: ‘ఇన్షా అల్లాహ్.. తగిన సమాధానం ఇస్తాం’.. పాక్‌కు తాలిబన్ల హెచ్చరిక
-
NSE Listing: బీఎస్ఈలో ఎన్ఎస్ఈ గ్రాండ్ ఎంట్రీ.. లిస్టింగ్ అయిన గంటలోనే కోటి షేర్లు ట్రేడ్!
-
Employee Salary: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 5 రోజుల ముందుగానే అకౌంట్లోకి సెప్టెంబర్ నెల జీతం..
-
DSP Bheem Reddy : భీమ్ రెడ్డి బినామీలపై ఏసీబీ ఫోకస్.. 8 ఇళ్లలో ఏకకాలంలో సోదాలు
ట్రెండింగ్
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!